Political News

డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసి.. శ‌వాన్ని చిత‌క‌బాదాడా?


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామన్నారు. హత్య ఘటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

హత్య ఘటనపై డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగింటినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించామని.., నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఎస్పీ చెప్పిన వివ‌రాలు..

“ఈనెల 19న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం తాగాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చారు. సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటివైపు కారులో వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు రుణం ఇచ్చారు. అందులో కొంత తిరిగి చెల్లించాడు సుబ్రహ్మణ్యం. మిగిలిన రుణం చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పద్ధతి మార్చుకోవాలని సుబ్రహ్మణ్యానికి అనంతబాబు చెప్పాడు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తిరగబడేసరికి అనంతబాబు నెట్టారు. అనంతబాబు నెడితే సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. సుబ్రహ్మణ్యం లేచి మళ్లీ అనంతబాబు మీదకు వచ్చాడు. దీంతో.. అనంతబాబు మళ్లీ వెనక్కి నెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గ్రిల్‌ తగిలి సుబ్రహ్మణ్యం తలకు మళ్లీ గాయమైంది. గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లాడు. కారులో తరలిస్తుండగా సుబ్రహ్మణ్యానికి శ్వాస రావట్లేదని గమనించాడు. సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు అనంతబాబు భావించాడు.” అని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.

ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు శ‌వాన్ని కొట్టాడా?!

శ్రీరామ్‎నగర్ శంకర్ టవర్ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఘర్షణ జరిగిందని.. తోపులాటలో ఐరన్ రాడ్ తగిలి సుబ్రహ్మణ్యంకు బలమైన గాయమైందని అనంత‌బాబు చెప్పిన‌ట్టు ఎస్పీ తెలిపారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో సుబ్రహ్మణ్యం శ్వాస ఆగిపోయిందని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి చెందటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనంతబాబు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించాలంటే.. బాడీలో అన్ని చోట్ల గాయాలు ఉండేలా అప్ప‌టికే చ‌నిపోయిన‌ సుబ్రహ్మణ్యంను(శ‌వాన్ని) అనంతబాబు కర్రతో విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు!

ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం.. స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు అనంత బాబును హాజరు పరిచారు. అనంత‌రం ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

This post was last modified on May 24, 2022 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

22 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago