కారు డ్రైవర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత భాస్కర్ బాబును అరెస్ట్ చేయకపోవటంపై టీడీపీ అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
గర్భవతిగా ఉన్న సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తన భర్త హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ కోరుతున్నారన్న చంద్రబాబు.. టీడీపీతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు సుబ్రహ్మణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారన్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయకపోవటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చెయ్యకపోవడాన్నితప్పుపట్టారు. నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసుల వ్యవహరిస్తున్న తీరు.. బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని విమర్శించారు.
సుబ్రహ్మణ్యం.. ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్ పని మానేసి, ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం (మే 19) రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా.. ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి.. నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని, అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి ఒకటిన్నరకు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.
మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా.. నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో.. తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. వెంటనే దించి జీజీహెచ్కు తీసుకెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
ఆయన మళ్లీ వచ్చి కారు డోర్ తీసి.. తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంట్ వద్దకు తేవటం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటి ఆధారంగా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య సుబ్రహ్మణ్యం మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. ఈ పోస్టు మార్టం నివేదికలో హత్యేనని తేలడంతో పోలీసులు దీనిపై హత్య కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీని అరెస్టు చేస్తామని చెప్పారు. మరోవైపు.. బాధిత కుటుంబానికి సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
This post was last modified on %s = human-readable time difference 7:26 am
అక్కినేని అభిమానులు అప్డేట్స్ కోసం అలో లక్ష్మణా అంటూ తపించిపోతున్న తండేల్ విడుదల తేదీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే…
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…