Political News

మోడీని ప్ర‌శ్నించేవారంతా.. దేశ‌ద్రోహులా?: కేసీఆర్ ఫైర్‌.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని సీఎం తెలిపారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు.

అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున 18 కోట్ల రూపాల‌య విలువైన చెక్కులను సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాల‌కు పంపిణీ చేశారు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భమన్న ఆయన… రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలిపారు. దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని కొనియాడారు. భగత్‌సింగ్‌ వంటి వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని పేర్కొన్నారు. పంజాబ్‌ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారన్న సీఎం.. హరిత విప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారని స్పష్టం చేశారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం అభినందించారు. రైతుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీజేపీను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.

“ఇది చాలా బాధాకరమైన సందర్భం. రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశం పరిస్థితి మారలేదు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు. పంజాబ్‌ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారు. రైతుల పోరాటానికి మేం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోంది. మోడీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు. “ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ సరిహద్దులో రైతులు ఏడాదికి పైగా చేసిన పోరాటం కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందినది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యావత్‌ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని కొనియాడారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయన్న ఆయన… ఆందోళనలో పాల్గొన్న రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు.

This post was last modified on May 23, 2022 6:28 am

Share

Recent Posts

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

53 minutes ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

1 hour ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

2 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

2 hours ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

4 hours ago