యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో బాగా డౌన్ అయినట్లు కనిపించిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. అఖండతో భలేగా పుంజుకున్నాడు. ఆ ఊపు తగ్గనివ్వకుండా.. తర్వాత క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడాయన. క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న బాలయ్య..
దీని తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడితో జట్టు కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లోనే పట్టాలెక్కుతుందని అనిల్ ఆల్రెడీ వెల్లడించడం విదితమే. కాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి క్రేజీ కామెంట్లు చేశాడు అనిల్. ఈ సినిమా విషయంలో తాను పిచ్చ ఎగ్జైటెడ్‌గా ఉన్నట్లు చెప్పిన అనిల్.. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నింటి కంటే భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలిపాడు.
కామెడీ, ఎంటర్టైన్మెంట్ తన ప్రధాన బలాలని.. కానీ వాటిని బాలయ్య సినిమాకు దాదాపుగా పక్కన పెట్టబోతున్నట్లుగా అనిల్ తెలిపాడు. కొంచెం కామెడీ టచ్ ఉన్నప్పటికీ.. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల మాదిరి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ స్టయిల్లో ఈ సినిమా ఉండదని, బాలయ్యతో సినిమా అంటే అలా చేయడం కూడా బాగుండదని అనిల్ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా కోసం తాను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నానని.. అదేంటో తనకు మాత్రమే తెలుసు కాబట్టి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని.. తన కెరీర్లో బెస్ట్ వర్క్‌గా బాలయ్య సినిమా నిలుస్తుందని నమ్ముతున్నానని అనిల్ చెప్పాడు.
పోకిరి, గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి తరహాలో పూర్తిగా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచే సినిమా ఇదని.. ఇలాంటి వాటికి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని.. తన సినిమాలో బాలయ్య 45 ఏళ్ల నడి వయస్కుడి పాత్రలో కనిపిస్తారని.. ఆయన తనయురాలిగా శ్రీ లీల నటిస్తుందని వెల్లడించాడు అనిల్. మొత్తంగా అనిల్ మాటలు చూస్తే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతోందని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on May 23, 2022 6:18 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…