Political News

షాకింగ్ న్యూస్‌: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల భారీ త‌గ్గింపు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల‌మ్మ దేశ ప్ర‌జ‌ల‌పై క‌రుణ కురిపించారు. పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది(లోక‌ల్ ట్యాక్స్‌లు కొన‌సాగుతాయి). గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.

వంటగ్యాస్పై వారికే రాయితీ:

పేదలుగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం రూ. 200 సబ్సిడీని ప్రకటించింది. దీని ద్వారా 9 కోట్ల మంది పథకం లబ్దిదారులకు మేలు జరగనుంది. చమురు ధరల తగ్గింపుతో ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గ్యాస్‌ రాయితీ వల్ల రూ.6100 కోట్లు ఆదాయం తగ్గనుందని వివరించారు.

నిర్మాణ రంగానికి ఊరట:

ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణాలు భారంగా మారిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఆయా రంగాలకు సంబంధించిన పలు వస్తువులపై కేంద్రం సుంకాలను తగ్గించింది. ఉక్కు, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకంలో కోత వేసింది. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై సుంకాన్ని తగ్గించింది.

ఎన్నిక‌ల ఎఫెక్ట్

లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గించ‌డం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. వీటి ని త‌గ్గించ‌డం ద్వారా ప్ర‌త్య‌క్షంగా కంటే..ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గుతాయి. నిత్యావ‌స‌రాలు.. కూర‌గాయ‌ల ధ‌ర‌లు.. ర‌వాణా సేవ‌లు.. వంటివి ఎంతో కొంత త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. ఫ‌లితంగా.. ప్ర‌జ‌లకు ఊర‌ట క‌లుగుతుంద‌ని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ‌రో నాలుగు మాసాల్లో గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము క‌శ్మీర్‌, మ‌రో ఆరు మాసాల్లో క‌ర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on May 21, 2022 11:36 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

48 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago