వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నోటీసును వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేరుతో విడుదల చేసింది. తద్వారా, మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి సత్తా ఏంటో తెలిసిందని అంటున్నారు.
ఇటీవలి కాలంలో రఘురామకృష్ణంరాజుకు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో నువ్వా నేనా అనేలా విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా రఘురామకృష్ణం రాజు వైసీపీ నేతలకు మంట పుట్టించే పలు కామెంట్లు చేశారు. పార్టీ అడిగితేనే తాను తిరిగి వైసీపీలో చేరానని, పార్టీ గుర్తు లేకపోయినా సొంతంగా ఎంపీగా గెలవగల సత్తా తనకుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం కొద్దిరోజులకు తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్, జిల్లా ఎస్పీలకు ఆయన లేఖలు కూడా రాశారు. ఎంపీ వ్యాఖ్యలు, చర్యలు పార్టీలో తీవ్ర కలవరం కలిగించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నోటీసులు జారీ చేసింది.
వివిధ పత్రికల క్లిప్పింగ్స్ జోడిస్తూ పలు అంశాలను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. మూడు రాజధానుల నిర్ణయం మీద ధిక్కార స్వరం, ఇంగ్లీష్ మీడియం అంశంలో విభేదించడం, బతిమలాడితేనే పార్టీలో చేరానన్న కామెంట్స్, ఇసుక విషయంలో ఎమ్మెల్యేల మీద విమర్శలు, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందనే వ్యాఖ్యల పత్రికల క్లిప్పింగులు జోడిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను నోటీసులో తప్పుపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై వివరణ ఇచ్చారు.
కాగా, గత కొద్దికాలంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం చేస్తున్న వారికి చెక్ పెట్టేలా, విజయసాయిరెడ్డి పేరుతోనే ఈ షోకాజ్ నోటీసు అందించడం గమనార్హం. తద్వారా మరోమారు వైసీపీలో నంబర్2 విజయసాయిరెడ్డి అని జగన్ చెప్పకనే చెప్పారని పలువురు చర్చించుకుంటున్నారు.
This post was last modified on June 24, 2020 3:48 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…