జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ అదినేత చంద్రబాబు అన్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమన్న విషయం సీఎం జగన్‌కు అర్థమైందన్నారు. ముందస్తు ఎన్నికల యోచనలో సీఎం జగన్ ఉన్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గెలుపు ఏకపక్షంగా ఉండాలని.. అది కూడా టీడీపీనే గెలవాలని ఆ విధంగా అందరూ కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి న చంద్రబాబు.. 2024కు ముందుగా ఎన్నికలు వచ్చినా నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్‌కు అర్థమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బూటకమని ప్రజలకు తెలుస్తోందని చెప్పారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీపైనే ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు.. గడపగడపలో వైసీపీ నేతల నిలదీతలే అందుకు నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర కష్టాలపాలయ్యారని చంద్రబాబు ఆక్షేపించారు. తన పర్యటనల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనను నేతలతో పంచుకున్న ఆయన.. నాయకులు అనేవారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని అన్నారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
“ముందస్తు ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని జగన్‌కు అర్థమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బూటకమని ప్రజలకు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు.. మనపైనే ఆశలు పెట్టుకున్నారు. గడపగడపలో వైసీపీ అధికార పార్టీ నేతలకు నిలదీతలే ఇందుకు నిదర్శనం. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాలపాలయ్యారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఇంటింటికెళ్లాలి. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని మనకు పాజిటివ్‌గా మార్చుకోవాలి” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on May 17, 2022 10:57 pm
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల…
గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా అఘోరి వ్యవహారం మరింత ముదురుతోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ..…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడిన విధానం అక్కడి జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులపై…
ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే…