Political News

కాంగ్రెస్ సార‌థిగా ప్రియాంక గాంధీ! ప్ర‌క‌ట‌నే లేటు!

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు.. ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలు.. ప్రియాంక గాంధీకేనా?.. ఆమెకే ప‌గ్గాలు అప్ప‌గించ‌నున్నా రా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టేందుకు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నవసంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఆరు కమిటీలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది.

అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకపోతే.. అధ్యక్షురాలిగా ప్రియాంకను నియమిం చాలని యూపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. దేశ సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ మేధోమథనం కొనసాగిస్తోంది. ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవ డానికి సామాజిక న్యాయ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది.

రాజస్థాన్లోని ఉదయ్పుర్లో కొనసాగుతున్న నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలనే అంశంపై తెరపైకి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేత ప్రమోద్ కృష్ణం డిమాండ్ చేశారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా.. ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు యూపీ నేతలు. అయితే.. అజెండాలో లేని అంశాలు మాట్లాడవద్దని కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్ ఖర్గే సూచించారు. మరో వైపు.. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కు పగ్గాలు అప్పగించాలని ప్రమోద్ కృష్ణం డిమాండ్ చేశారు. అయితే అలాంటి చర్చలకు ఇక్కడ ఆస్కారం లేదని మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు.

మూడు రోజుల కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శివిర్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆరు ప్రధాన అంశాలపై నేతలు మేధో మథనం జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆరు కమిటీలు రూపొందించిన సిఫార్సుల ముసాయిదాలను ఆదివారం.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అందించనున్నారు. ఉదయం 11 గంటలకు భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఆరు కమిటీలు ఇచ్చిన సిఫారసులు, తీర్మానాలను వర్కింగ్ కమిటీలో ప్రవేశపెట్టనున్నారు.

రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాలకు ఆమోదం తెలపనుంది సీడబ్ల్యూసీ. ఆదివారం మధ్యాహ్న 3 గంటలకు చింతన్ శిబిరానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్ర‌సంగిస్తారు. అనంతరం నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల ముగింపు ఉపన్యాసంలో సోనియా కీలక ప్రకటన చేయనున్నారు.

This post was last modified on May 15, 2022 3:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

59 mins ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

2 hours ago

మీనాక్షి.. హీరోల గురించి ఒక్క మాటలో

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…

2 hours ago

ద‌ర్శ‌కుడైతే ఎవరికెక్కువ..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ర్శ‌కుడైనంత మాత్రాన చ‌ట్టాలు పాటించ‌రా? అని…

2 hours ago

వైసీపీకి షాక్‌.. ఒకే రోజు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసులు

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి సోమ‌వారం ఒకే స‌మ‌యంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమ‌వారం…

2 hours ago