చింతన్ శిబిర్‌లో ఇప్పుడు గాంధీల కుటుంబానికే పెద్ద చింత ఎదురయింది. దేశవ్యాప్తంగా కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని భావిస్తున్న పార్టీ కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించింది. అయితే.. ఈ సమస్య.. తొలిగా.. సోనియా కుటుంబానికే పెద్ద చిక్కు తీసుకువచ్చింది. ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ఇద్దరు సోనియా, రాహుల్ పోటీ చేస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో కుమార్తె, అల్లుడు.. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు కూడా రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనేది.. పార్టీఅ ధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక, ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతూనే పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరిగే చింతన్ శిబిర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్. “చింతన్ శిబిర్లో ‘ఒకే కుటుంబం- ఒకే టికెట్’ ప్రతిపాదనపై చర్చ జరగుతోంది. ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీతో గత ఐదేళ్లుగా పనిచేసినట్లయితే.. వారికి మినహాయింపు ఉంటుంది. మండల కమిటీల ఏర్పాటుపై బూత్, బ్లాక్ స్థాయి కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం, ప్రస్తుతం పార్టీలో పదవీ కాలం గరిష్ఠంగా 3 ఏళ్లు ఉండగా.. దానిని ఐదేళ్లకు పెంచటం, పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది.” అని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూపీ లోని రాయ్బరేలీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. కేరళలోని వయనాడ్ లోక్సభ ఎంపీ గా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అయితే.. చింతన్ శిబిరంలో చర్చకు వచ్చిన ‘ఒకే కుటుంబం.. ఒకే టికెట్’ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపితే.. గాంధీ కుటుంబీకులపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు.
దీంతో సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది. దీనికితోడు.. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని.. అల్లుడు రాబర్ట్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే, ఈ ప్రతిపాదనలోనే ఐదేళ్ల మెలిక ఉన్నందున వారి పదవులకు వచ్చిన ముప్పేదీ లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా.. కుటుంబ పార్టీలే వర్ధిల్లుతాయన్నమాట.!!
This post was last modified on May 13, 2022 5:00 pm
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…