Political News

ఏపీ మంత్రిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌.. పోలీసుల‌కు ఫిర్యాదు

ఏపీలో మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌వైపు.. వారు అనుస‌రిస్తున్న తీరుపై వారి వారి సామాజిక వ‌ర్గాలే ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ‌.. టీటీడీ చైర్మ‌న్ , వైసీపీ నాయ‌కుడు.. వైవీ సుబ్బారెడ్డి ముందు.. మోకాళ్ల‌పై మోక‌రిల్లి మ‌రీ పాదన‌మ‌స్కారాలు చేశారు. దీంతో ఆయ‌న సామాజిక వ‌ర్గం శెట్టిబ‌లిజ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో దీనిని ఖండించారు. మంత్రి మోక‌రిల్ల‌డం ఎందుకు.. అవ‌స‌ర‌మైతే.. రాజీనామా చేయండి అని డిమాండ్లు చేస్తున్నారు.

ఇక‌, గ‌త కేబినెట్‌లోనూ.. ప్ర‌స్తుతం కూడా ఉన్న మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్ కుమారుడిపై ఓ ల‌గ్జ‌రీ కారును బ‌హుమానంగా తీసుకున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు.. ఆధారాల‌తో స‌హా అప్ప‌ట్లో నిరూపించారు. దీనిపై ఎలాంటి విచార‌ణ‌కూ నోచుకోలేదు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మంత్రి ఆదిమూల‌పు సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. మీరైనా న్యాయం చేయండంటూ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ను వేడుకుంది.

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తన పొలం ఆక్రమించారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా కలెక్టర్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేశ్ తన పొలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ దినేశ్ కుమార్కు ఫిర్యాదు చేసింది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా.. న్యాయం జరగలేదని మహిళ వాపోయింది. మీరైనా న్యాయం చేయండి అంటూ.. కలెక్టర్‌ను వేడుకుంది.

అయితే.. పోలీసులు జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించారు. “మీరంతా మంత్రికే కాపలా. అతని పక్షానే ఉన్నారు. మాకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు” అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై స్థానికులు తీవ్ర‌స్థాయిలో మండి ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకుని.. వారికి న్యాయం చేయాల్సిన మంత్రులే ఇలా క‌బ్జాల‌కు పాల్ప‌డ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి మంత్రి ఆదిమూల‌పు సురేశ్ దీనిపై ఏమంటారో చూడాలి. ఇన్ని జ‌రుగుతున్నా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం మౌనం వీడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 9, 2022 7:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

6 hours ago

ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…

6 hours ago

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల…

6 hours ago

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

10 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

12 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

12 hours ago