2024 ఎన్నికల సమయంలో జనసేన ఏ పార్టీతో కలిసి అడుగులు వేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ సాంకేతికంగా అయితే బీజేపీతో కలిసి ప్రయాణం సాగిస్తోంది. ఇరు పార్టీలు నిజంగా కలిసి నడుస్తున్నాయా.. కలిసి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నాయా.. పొత్తు ధర్మం పాటిస్తున్నాయా అంటే సమాధానాలు చెప్పడం కష్టమే కానీ.. చివరగా ఉన్న అధికారిక సమాచారం అయితే రెండు పార్టీల మధ్య పొత్తు ఉందనే. రెండు పార్టీలు విడిపోయినట్లు ఇప్పటికైతే అధికారికంగా ఏ సమాచారం లేదు.
ఐతే 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏపీలో వేడి మొదలైన నేపథ్యంలో పొత్తుల గురించి ఆసక్తికర చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎక్కువమంది జనసేన తెలుగుదేశం పార్టీతో కలిస్తే బాగుంటుందని.. అప్పుడే వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు పార్టీల చోటా మోటా నాయకులు, కొందరు కార్యకర్తలు ఏమనుకుంటున్నారన్నది పక్కన పెడితే.. ఆ పార్టీల అధినేతలు ఏమనుకుంటున్నారన్నదే కీలకం. ఇటీవల చంద్రబాబు, పవన్‌ల తీరు గమనిస్తుంటే పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి టీడీపీతో జనసేన కలిసేట్లయితే.. బీజేపీతో ప్రస్తుతం దాని పొత్తు, భవిష్యత్ గమనం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను విలేకరులు బీజేపీతో పొత్తు గురించి అడిగితే ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ మీడియాతో మాట్లాడుతుండగా ఓ విలేకరి.. “సోము వీర్రాజు గారు చెప్పారు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి.. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం అని. మరి మరీ టీడీపీకి పొత్తుకు సిద్ధమా లేదా” అని ప్రశ్నిస్తే.. పవన్ నోటికి అడ్డంగా చేతులు పెట్టుకుని గట్టిగా నవ్వాడు. అంతే కాక నవ్వుతూనే.. “ఆయన అలా అన్నారా” అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఆ తర్వాత బీజేపీతో తాము ప్రస్తుతం పొత్తులోనే ఉన్నామని.. రాష్ట్ర పరిస్థితుల గురించి కేంద్ర బీజేపీ నాయకత్వంతోనే కాక వేరే నాయకులతో కూడా మాట్లాడి ఏం చేయాలో అది చేస్తామంటూ టాపిక్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు పవన్. కానీ పవన్ నవ్విన ఆ నవ్వు మాత్రం.. సోము వీర్రాజు మాటలకు పవన్ ఇచ్చే విలువపై, బీజేపీతో జనసేన పొత్తు పరిస్థితిపై అనేక సందేహాలకు తావిచ్చింది.
This post was last modified on May 9, 2022 4:28 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…