Political News

వైసీపీకి 2024 ఎన్నిక‌ల్లో 15 సీట్లు కూడా రావు: ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

సామాజిక అసమానతలు పోవాలని రాజకీయాల్లోకి వచ్చాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి 2024 ఎన్నిక‌ల్లో 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. త‌న‌ను ఆర్థికంగా దెబ్బ తీసినా లెక్క చేయబోన‌ని చెప్పారు. వ్యక్తిగత దాడులు చేసినా భరించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరని ప్ర‌శ్నించారు.

“వృద్ధాప్య పింఛను పథకాన్ని ఆనాడు సంజీవయ్య తెచ్చారు. పింఛను పథకానికి దామోదరం సంజీవయ్య తన పేరు పెట్టుకోలేదు.” అని వైసీపీని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. వ్యూహాలే ఉంటాయని పవన్ అన్నారు. మేం సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరు ఎవరని ప్రశ్నించారు. తనకు పదవులు అక్కర్లేదని.. డబ్బు పై వ్యామోహం లేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తానేప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తానని.., ప్రజల కన్నీరు తుడవని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు.

రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్న పవన్.. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు. “నాపై కేసులు లేవు కనుకే ఢిల్లీలో ధైర్యంగా మాట్లాడగలిగా. మీ తరఫున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి. ఇంత మెజారిటీ ఇచ్చినా ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. ఇతరుల జెండాలు, అజెండాలు నేను మోయను. వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై బీజేపీ పెద్దలకు చెబుతా. మైనార్టీలకు జనసేన అండగా ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా వైసీపీ నేతలకు లంచం ఇవ్వాల్సి వస్తోంది” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

సిద్ధేశ్వరం-అలుగు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామ‌ని నంద్యాల ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఐదేళ్ల సమయం ఇవ్వండి.. రాయలసీమను రతనాలసీమ చేస్తామ‌న్నారు. సమాజంలో మార్పు కోసం యువత ఆలోచించాలని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం అన్నారు.. అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్‌ అన్నారు.. ఇప్పటివరకూ లేదు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. అని వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు కొన‌సాగించారు.

పొత్తులపై చర్చలు జరగాలని ప‌వ‌న్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని ఆకాంక్షించారు. ఏపీ నిర్మాణానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని కోరారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే చూద్దామని ప‌వ‌న్ అన్నారు. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రోడ్‌ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తామని తెలిపారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదని పవన్‌కల్యాణ్ తెలిపారు.

This post was last modified on May 9, 2022 7:16 am

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

39 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago