నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమా లేదంటే ముందస్తు ఎన్నికల ప్లాన్ ఉందా అనే అంచనాలు పక్కనపెడితే… తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని ప్రతిపక్షాల వరకు ఈ ఎత్తుగడల్లోనే బిజీగా ఉన్నాయి. అయితే, రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యం అయితే టీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయ వేదికలపై అధికార పార్టీ చేస్తున్న కామెంట్లు, వ్యవహరిస్తున్న తీరుతో రాబోయే ఎన్నికలను టీఆర్ఎస్ రెడీ చేసుకుందని చెప్తున్నారు. అధికార పార్టీ వ్యూహం మొత్తం అటు ఢిల్లీ, లేదంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల చుట్టే చక్కర్లు కొడుతుందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. దీనికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గత కొద్దికాలంగా స్పందిస్తున్న తీరును ఉదహరిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన బెంగళూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రోజూ కరెంట్ కట్ చేస్తున్నారని ఓ పారిశ్రామికవేత్త ట్వీట్ చేయగా దీనికి కేటీఆర్ రియాక్ట్ అవుతూ.. బ్యాగులు ప్యాక్ చేసుకొని హైదరాబాద్‌కు వచ్చేయాలని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని తెలిపారు. దీనికి కొనసాగింపుగా, ‘ఏపీలో కరెంటు లేదు’ అనే కామెంట్ పక్క రాష్ట్రాల కంటే తాము ఎంత మేలన్నది తెలియజేశారు.
ఏప్రిల్ 27న నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్లీనరీ కేంద్రమే టార్గెట్‌గా కొనసాగింది. ప్లీనరీలో 13 తీర్మానాలు చేస్తూ మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా చేసినవే. పార్టీ చీఫ్ కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఎమ్మెల్యేల వరకు కేంద్రంపైనే విమర్శలు చేశారు. అంతకుముందు వడ్ల కొనుగోళ్లపై ఇందిరాపార్క్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేసింది. తెలంగాణలో వడ్లను ఎఫ్‌సీఐ కొనాలనే వాదనతో ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు దిగింది. సెంటిమెంట్ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ రాబోయే ఎన్నికలకు తమ అజెండాగా… పొరుగు రాష్ట్రాలతో పోలిక, కేంద్రం శీతకన్ను అజెండాతో ముందుకు సాగుతోందని ఇవే ఎన్నికల వ్యూహాలని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on May 4, 2022 3:24 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…