తాజాగా ఏపీకి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన నాలుగు సీట్లను వైసీపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.
దీంతో, ఖాళీ అయిన మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఖాళీ అయిన బీసీ వర్గానికి చెందిన మంత్రి పదవులను ఆ సామాజికవర్గానికే కేటాయించాలని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు, ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవిని బీసీ సామాజిక వర్గానికే కేటాయించాలని జగన్ యోచిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే యువ ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అనిల్ కుమార్ ను డిప్యూటీ సీఎం చేయాలని జగన్ ఫిక్సయ్యారని ప్రచారం జరుగుతోంది.
మొదటి నుంచి జగన్ కు, పార్టీకి వీర విధేయుడిగా ఉన్న అనిల్ కుమార్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. దీంతోపాటు బీసీల్లో సింహభాగం ఓటింగ్ ఉన్న యాదవ సామాజికవర్గ నేతగా అనిల్ కుమార్ కు మంచి పట్టు ఉండడంతో జగన్ అనిల్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూర్చోబెట్టాలని జగన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రెండో సారి ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ ను మంత్రిని చేసిన జగన్ తాజాగా..మరో ప్రమోషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట.
దీంతోపాటు, బీసీ సామాజివర్గంలోని 139 కులాల్లో యాదవుల జనాభా అధికం. దీంతో, అనిల్ కు చాన్స్ దక్కిందని తెలుస్తోంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ను జగన్ ఏరికోరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మీర డిప్యూటీ సీఎం చేశారు.
ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అదే తరహాలో తనకు, పార్టీకి వీర విధేయుడైన అనిల్ కుమార్ ను జగన్ ఎన్నుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే జగన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని సీనియర్లతో కూడా ఈ విషయంపై జగన్ చర్చించినట్లు సమాచారం.
This post was last modified on June 23, 2020 3:13 pm
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…