పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం.. ఖాయమని.. ఆ పార్టీ అధినేతే పలుమార్లు ఇటీవల కాలంలో వ్యాఖ్యానించారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన లక్ష్యం అధికారమే అనే విషయం అందరికీ అర్ధమైంది. ఓకే.. మరి టార్గెట్ ఎంత? ఎన్ని స్థానాల్లో విజయం సాధించాలని.. లక్ష్యంగా పెట్టుకుని.. ఎన్ని స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు? అనేది ఇప్పుడు జనసేన గురించిన ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే.. కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే.. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఒక నిర్ణీత లక్ష్యాన్ని దాదాపు పెట్టుకుంది. కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా.. కుదిరితే మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలని.. లేకపోతే.. ఇప్పుడున్న స్థానాలను 151 స్థానాలను నిలబెట్టుకోవాలని.. నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా మే 10 నుంచే ప్రారంబించనుంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లలో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది.
లేకపోతే.. కనీసం 100 స్థానాలనైనా గెలవాలని.. టీడీపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ పార్టీ కూడా ముందుకు కదులుతోంది. జూన్ నుంచి యాత్రలు ప్రారంభించనుంది. అయితే.. ఇప్పుడు ఎటొచ్చీ.. జనసేన లక్ష్యం ఏంటనేది ముఖ్యంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. పదే పదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులను కదిలించడం లేదు. నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు కూడా లేరు. ఇక, మండలస్థాయిలో బూత్ కమిటీలు లేవు.
ఇవన్నీ ఎలా ఉన్నా.. బలమైన లక్ష్యం అంటూ ఉండాలి కదా?. అది ఏది? వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. అనే కామన్ డైలాగు పేల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. పార్టీలోనే చర్చ సాగుతోంది. నిర్దిష్టంగా ఇన్ని సీట్లలో విజయం దక్కించుకుంటాం.. అని కనుక నిర్ణయించుకుంటే.. అంటే.. 100 లేదా 150 లేదా 170 ఇలా.. ఏదో ఒక ఫిగర్ నిర్ణయిస్తే.. దాని ప్రకారం.. జనసైన్యాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి జనసేనాని.. ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 2, 2022 5:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…