కొన్ని సార్లు మాటల్లో అతి ఉండనివ్వండి కానీ కొన్ని అయినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కరోనా వేళల్లో చిరు అందించిన సాయం మొదలుకుని కార్మికులు తమ జీవితాలు ఏ విధంగా సంస్కరించుకోవాలో వరకూ ఎన్నో విషయాలు ఆసక్తిదాయకంగా, ఆవేశపూరితంగా టీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
నేను చిరంజీవి అభిమానిని అంటూ తన ఆనందం పంచుకుని, త్వరలో తానూ సినీ నిర్మాణం చేపట్టనున్నానని సభా ముఖంగా ప్రకటించారు. చిరును ఉద్దేశించి మీరూ, నేనూ కలిసి వీళ్ల కోసం పనిచేద్దాం అని చెప్పి సినీ కార్మికోత్సవాన కొత్త ఆనందాలు నింపారు మల్లారెడ్డి. ఈ స్థాయిలో ఏపీ మంత్రి చెల్లుబోయిన మాట్లాడలేకపోయారు.
నేను చిరంజీవి అభిమానిని అని హోరెత్తించారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనది ఆంధ్రా అయినా ఆయన తెలంగాణ బిడ్డే అని మరో మంచి మాట కూడా అన్నారు. చిరంజీవే కాదు తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్న వారంతా తెలంగాణ బిడ్డలే అని కూడా అన్నారు. తనదైన మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఒక్కసారి బండ్ల గణేశ్ ను గుర్తుకు తెచ్చారు ఆయన. ఆయన మాటలు విని చిరు ఆద్యంతం నవ్వులు చిందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో చిరు అందించిన సేవలను కొనియాడారు.
ఇదే సందర్భంలో ఇదే వేదికపై మాట్లాడిన చెల్లుబోయిన వేణు (ఏపీ మంత్రి) కొంత సొంత డబ్బా కొట్టుకున్నారు కానీ చిరు గురించి మాత్రం ఆకట్టుకునే రీతిలో మాట్లాడలేకపోయారు. ఇవాళ కార్మికుల పండుగ మే డే రోజున సినీ శ్రామికులంతా ఓ చోట చేరారు. హైద్రాబాద్, యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ వేదిక అనేక ప్రత్యేకతలకు ఆనవాలుగా నిలిచింది.
ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఆవేశంతో మాట్లాడినా కూడా కొన్ని నిజాలు చెప్పారు. తాను ఎలా ఎదిగివచ్చానో ఎంతటి చిన్న స్థాయి నుంచి వచ్చానో కూడా చెప్పారు. కార్మికులలో కొత్త ఉత్సాహం నింపేందుకు తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయని, రేపటి రోజు మీరు మరింత కష్టపడండి మీకు ఇంకా మంచి జరుగుతుంది అని మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. కొంత అతి ఉన్నా కూడా కొన్ని మాటలు చాలా అంటే చాలా బాగున్నాయి.
ఏపీ మంత్రి కన్నా టీజీ మంత్రులే చిరు సేవలను ప్రస్తావించారు. ప్రస్తుతించారు.
చిరు చిత్రపురి కాలనీలో ఆస్పత్రి కట్టిస్తున్నారని మంత్రి తలసాని యాదవ్ చెబుతూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా కార్మికుల పిల్లల చదువుల కోసం పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చారని కూడా చెప్పారు.ఇవన్నీ తెలంగాణ మంత్రులు చెప్పిన మాటలు. ఇవన్నీ చిరు చేసిన సేవలకు
వారు చెప్పిన ప్రశంసలు. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా వ్యాప్తికి భాగ్యనగరి ఏ విధంగా తోడ్పడింది అన్నది కూడా చెప్పారు.
This post was last modified on May 1, 2022 9:18 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…