టీబీజేపీకి కొత్త చరిష్మా తేవటంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద చేసే పోరు విషయంలో బండి సమర్థత సరిపోలేదన్న మాట వినిపిస్తుంది. అన్నింటికి మించిన ఆయన మాటతీరే ఆయనకు పెద్ద ప్లస్ ఎలానో.. అంతే పెద్ద మైనస్ అన్న విమర్శ పలువురు బీజేపీ నేతల ప్రైవేటు సంభాషణల్లో వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ ముఖ్యమంత్రికి ఏదైనా పంచ్ ఇచ్చేటప్పుడు.. ఆయనకు విమర్శలు.. ఆరోపణలతో షాకివ్వాలంటే అందుకు పక్కా ఆధారాలతో కూడిన వ్యాఖ్యల్నే చేయాల్సి ఉంటుంది.
అంతే తప్పించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. అలాంటి ప్రత్యర్థుల్ని ఆడేసుకోవటం ఎలానో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. సీఎం కేసీఆర్ మీదా.. ఆయన సర్కారు మీదా అవినీతి ఆరోపణలు చేసిన బండి సంజయ్.. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవుడు పక్కా అంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. బండి నోటి నుంచి అరెస్టు మాట వచ్చి చాలానే రోజులైంది. అయినప్పటికి ఇప్పటికి ఏ ఒక్క పరిణామం చోటు చేసుకోలేదు కదా? కనీసం ఆ దిశగా అడుగులు పడిన పరిస్థితి కనిపించటం లేదు.
కేసీఆర్ జైలుకు పోవుడు ఖాయమన్నప్పుడు.. అందుకు అవసరమైన బలమైన సాక్ష్యాలు.. ఆధారాల్ని అంతో ఇంతో చూపించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటం తెలిసిందే. దీంతో బండి సంజయ్ మాటల్లో భారీ తనమే తప్పించి.. ఆయన చెప్పిన మాటలు నిజమనిపించేలా ఆధారాల్ని చూపించకపోవటం పెద్ద మైనస్ గా చెప్పాలి.
అలాంటి బండి గడిచిన రెండు వారాలకు పైనే పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
‘‘సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన ఆర్మీ గురించి దేశప్రజలకు వివరించేందుకు తీసిన యూరీ సినిమాపైనా, కశ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్‌ఫైల్స్ పైనా టీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలో రజాకార్ ఫైల్స్ తీస్తాం. అందులో కేసీఆర్.. కేటీఆర్‌ల చరిత్ర కూడా పెడతాం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతామని అదే పనిగా చెప్పే బండి సంజయ్ ఇప్పటివరకు ఆ పని చేయకపోవటం.. ఆ దిశగా అడుగులు పడకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు ముచ్చట తర్వాత కనీసం ఆయన నోటి నుంచి వచ్చిన రజాకార్ ఫైల్స్ మూవీ సంగతి అయినా కాస్తంత వేగంగా కార్యరూపం దాలిస్తే బాగుంటుందన్న మాట కమలనాథుల నోటి నుంచి వినిపిస్తోంది. తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అన్న విషయాన్ని బండి సంజయ్ ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on %s = human-readable time difference 6:18 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…
కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ),…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎన్వీఎస్ ఎస్…
మాస్ హీరో గోపిచంద్ ఇటీవల విశ్వం సినిమాతో మరో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అప్పుడెప్పుడో ‘లౌక్యం’తో కమర్షియల్ గా సక్సెస్…
ముద్రగడ పద్మనాభం. సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమాన్ని ఒంటిచేత్తో ముందుకు నడిపించిన పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ..…
క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు కానీ.. ఇప్పుడు ఇది రాజకీయాలకు బాగా నప్పుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో…