ఏపీ ప్రభుత్వంతో చెలిమిగా ఉండే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జూలు విదిల్చిందా? అనే రేంజ్‌లో కీలక మంత్రి, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపరర్టీ షోలో పాల్గొన్నకేటీఆర్.. మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన సరిగా లేదని.. నేరుగా వ్యాఖ్యానించారు. “నా మిత్రుడు ఏపీలో ఉంటాడు. మొన్నామధ్య నా దగ్గరకు వచ్చాడు. అక్కడి పరిస్థితి వివరించారు“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఏపీలో రోడ్లు లేవు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు. ఇక, సాగుకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక, రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. మీకు ఏమైనా అనుమానం ఉంటే.. ఒక్కసారి పొరుగు రాష్ట్రానికి కారులో వెళ్లిరండి పరిస్థితి మీకు తెలుస్తుంది!“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో రహదారులపై అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సాగుకు కాదు.. తాగేందుకే అక్కడ నీళ్లు దొరకడం లేదు. రోడ్లు గుంతలు పడి.. ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ..నాకు ఇష్టం లేక చెప్పడం లేదు.. వాస్తవాలే చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాల కంటే.. మౌలిక సదుపాయాల కల్పనలోనూ.. విద్యుత్, నీరు, వసతులు, రహదారులు ఇలా ఎలా చూసుకున్నా దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్‌లో ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టేందుకు అత్యుతమ గమ్యస్థానం హైదరాబాదేనని చెప్పారు. ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని.. 24/7 తాను అందుబాటులో ఉంటానని.. స్వయంగా ఏసమస్య వచ్చినా..తాను పరిశీలిస్తానని.. అన్నారు.
అంతేకాదు.. తన పిట్ట(ట్విట్టర్) ఎప్పుడూ పలుకుతూనే ఉంటుందని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. మొత్తంగా.. చూస్తే.. తన రాష్ట్రాన్ని బిజినెస్ చేసుకునేందుకు పొరుగు రాష్ట్రం ఏపీపై రాళ్లు వేయడం ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. మరి దీనిపై ఏపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on April 29, 2022 2:40 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…