వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. తనను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి సోదరులు పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులోను, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్ళపల్లెలోను ఎంఎల్ఏలుగా గెలిచారు.
2019లో అధికారంలోకి రాగానే కుప్పంలో చంద్రబాబును దెబ్బకొట్టడమే ధ్యేయంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న పెద్దిరెడ్డి మొత్తం కుప్పంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. స్ధానిక సంస్ధలు, మున్సిపాలిటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ ఇందులో భాగమే. అప్పటినుండి పెద్దిరెడ్డి రాజకీయానికి విరుగుడుగా చంద్రబాబు కూడా పుంగనూరుపై దృష్టిపెట్టారు.
మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో గురువారం తంబళ్లపల్లెకు చెందిన కొందరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి సోదరులకు వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని స్పష్టం చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీయే గెలిచేట్లు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కష్టపడాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించేంత శక్తి ఎవరికుందనేదే కీలకమైన ప్రశ్న.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి ఎవరిమీదో నమ్మకం ఉంచేకన్నా స్వయంగా చంద్రబాబే పుంగనూరులో రెగ్యులర్ గా పర్యటనలు పెట్టుకోవాల్సిందే. టీడీపీకి వచ్చే ఓట్లు చంద్రబాబును చూసేకానీ మాజీమంత్రిని చూసి కాదు. అందుకనే హైదరాబాద్ లోనో లేకపోతే మంగళగిరిలోనో కూర్చోకుండా చంద్రబాబు క్షేత్ర స్ధాయిలోకి వెళ్ళాల్సిందే.
నియోజకవర్గ నేతలపై భారం పెట్టేసి ఊరుకుంటె మొన్నటి కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు వచ్చినట్లే వస్తాయి. ఎందుకంటే వీళ్ళెవరికీ ఎవరిపైనా పట్టులేదు. ఏదో పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. కచ్చితంగా పెద్దిరెడ్డిని టార్గెట్ పెట్టుకుని ఓడించాలంటే నియోజకవర్గంలో తిరగకపోతే జరిగే పని కాదు. అమర్ కూడా ఎక్కువ రోజులు బెంగుళూరు వ్యాపారాలతోనే బిజీగా ఉంటారు. పెద్దిరెడ్డి మీద ఓడిపోయిన అమర్ మరదలు అనూషారెడ్డి కూడా బెంగుళూరులోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చుని పెద్దిరెడ్డి ఓడిపోవాలంటే జరిగే పని కాదు.
This post was last modified on April 29, 2022 1:41 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…