రాష్ట్రంలో మారుతున్న పరిణామాలను టీడీపీ నాయకులు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఏవిధంగా అడుగులు వేయాలి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎలా ఎక్కాలి? వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌లతో ఒక నివేదికను చంద్రబాబు తెప్పించుకున్నారని తెలిసింది. గడిచిన ఆరు మాసాలుగా జగన్ సర్కారుపై ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయంపై దీనిలో ప్రధానంగా ప్రస్తావించారు. ఎందుకంటే.. తొలి రెండున్నరేళ్ల కాలంలో జగన్ పాలన ఎలా ఉందనేది నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేకుం డా పోయింది. ఎందుకంటే.. రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయింది.
దీంతో ఆ సమయాన్ని వదిలేసి.. ఇటీవల ఆరు మాసాల పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏమనుకుంటున్నారని.. చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లే ఏ పార్టీకైనా కీలకంగా మారనున్నాయి. ఇలా అందిన రిపోర్టులను క్రోడీకరించి..వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోను కూడా రూపొందించాలని బాబు భావిస్తున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతు న్నారని తెలిసింది.
ప్రస్తుతం జగన్ పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. ఒక్కఛాన్స్‌తో తన జీవితాలు మారుతాయని అందరూ భావించారు. అయితే.. ఈ ఒక్క ఛాన్సే తమకు ఏమీ లేకుండా చేసిందనే బావన ప్రజల్లో ఉందని.. టీడీపీ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు నివేదికలో స్పష్టం చేశారని సీనియర్లు చెబుతున్నారు. “మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తున్నామని అంటున్నారు. కానీ, మాకు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు.“. అని వివిధ వర్గాల ప్రజలు నిలదీశారు. ఇక, ఉద్యోగుల సీపీఎస్.. బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. మెగా డీఎస్సీ.. మెగా డ్రీమ్‌గా నిలిచిపోయింది. ఇలా.. అనేక వర్గాల ప్రజలు టీడీపీ బాధ్యుల ముందు కుండబద్దలు కొట్టారు.
అంతేకాదు… “అన్నీ చేస్తున్నాం.. అంటున్నారు .కానీ.. ప్రబుత్వం చేస్తున్న సంక్షేమం కేవలంసమాజంలోని 10 శాతం మందికి కూడా చేరడం లేదు. మరి మిగిలిన 90 శాతం మంది ప్రజల(వీరిలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి,) పరిస్థితి ఏంటి?“ అని కొందరు ప్రశ్నించిన విషయాన్ని కూడా నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తంగా .. టీడీపీకి అనుకూల పరిణామాలు ఏర్పడుతున్నాయని.. వైసీపీ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితి ఉంటుందని.. ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనిని బట్టి చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
This post was last modified on April 29, 2022 9:37 am
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…