విద్య మరియు వైద్య రంగాలకు ఊతం ఇవ్వడం ఇవాళ అత్యావశ్యకం. మునుపటి కన్నా వేగంగా నిర్ణయాల అమలు కేసీఆర్ ముందున్న ఏకైక సవాలు. పరిణామాలు మారుతున్నందున తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కేసీఆర్ చేయాల్సిన కృషి ఎంతో ! తెలంగాణలో నిన్నటి వేళ మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు ఆరంభం అయ్యాయి. టిమ్స్ పేరిట భాగ్యనగరిలో ఉప్పల్, అల్వాల్, ఎర్రగడ్డలో ఇవి శంకుస్థాపనకు నోచుకున్నాయి. ఓ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు అత్యాధునిక వైద్యం అందించడమే ధ్యేయంగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై మంచి స్పందనే వస్తోంది.
స్థలం ఎంపిక దగ్గర నుంచి ఆస్పత్రులు డిజైనింగ్ వరకూ అన్నింటినీ కేసీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. గతంలో కన్నా ఇప్పుడు వైద్య రంగ పరంగా తాము అభివృద్ధి సాధించామని కేసీఆర్ చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కూడా అదే మాట అంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కన్నా తామే ఎంతో బాగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం అని, ఈ క్రమంలో ప్రాధాన్య రంగాలకు నిధుల కేటాయింపు విస్మరించడం లేదు అని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇక వైద్య రంగంలో గతం కన్నా మెరుగైన వసతులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో తెచ్చేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆస్పత్రులకు ఆయన శ్రీకారం దిద్దారు.
ఇదే వార్త ఆంధ్రాలోనూ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా ఊపిరి పోసుకోలేదు కనుక ! ఉన్న వాటిని అభివృద్ధి చేస్తూనే కొత్త వాటి కోసం కేసీఆర్ ఆరాట పడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా వైద్య రంగానికి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న చేయూత అన్నది కొనసాగితే ప్రభుత్వ పరంగా పేదలకు అందే సేవల్లో మెరుగుదల రావడం ఖాయం. ఆ విధంగా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఇవి ఎదిగితే సర్కారు దవఖానాలకు మళ్లీ మళ్లీ పేదలు రావడం, ఇక్కడి సేవలకు ముగ్ధులవడం ఖాయం.
రాష్ట్రం ఏర్పడిన నాడు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇవాళ తెలంగాణ లో 17 మెడికల్ కాలేజీలకు చేరుకుంది. రానున్న రెండేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. నర్సింగ్ కాలేజీలు 6 మాత్రమే రాష్ట్రం ఏర్పడిననాడు ఉండేవి. ఏ నర్సింగ్ కాలేజీలకు వెళ్లినా కేరళ స్ఠాఫ్ నర్సులు ఉండే వారు. కాని కాలేజీలు పెట్టలేదు. జిల్లాకో నర్సింగ్ కాలేజీలు పెట్టాలని, 33 జిల్లా కాలేజీలు పెట్టాలని నిర్ణయించారు. గద్వాల, బాన్సువాడ లో ఇప్పటికే ప్రారంభమైంది…అని చెబుతున్నారాయన.
This post was last modified on April 28, 2022 7:32 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…