కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అత్యధిక నష్టం
చవిచూస్తున్న దేశం అమెరికా. వారం కిందటి వరకు ఇటలీ కన్నీటి గాథల గురించి
చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అమెరికా దాన్ని దాటేసింది. ఊహించని
స్థాయిలో అక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా భయం
గొలిపేలా ఉంది.
ఆ దేశంలో గంటకు 107 మంది చనిపోతున్నారంటే పరిస్థితి
అంచనా వేయొచ్చు. ఒక్క రోజు వ్యవధిలో ఆ దేశంలో 2569 మంది కరోనా కారణంగా
ప్రాణాలు వదిలారు. వారం కిందటి వరకు ఏదైనా దేశంలో రోజుకు వెయ్యమంది చనిపోతే
వామ్మో అంటూ మాట్లాడాం. కానీ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో 2569 మంది
చనిపోవడమంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఒక్క దేశంలో కరోనా
మరణాలు 33 వేలకు చేరుకోవడం గమనార్హం.
ఐతే అమెరికాలో ఇంతటి దారుణమైన
పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అని
స్పష్టమవుతోంది. ఆయన నిర్లక్ష్య ధోరణి వల్లే దేశం అతలాకుతలం అయ్యే
పరిస్థితి తలెత్తిందన్నది స్పష్టం. అమెరికాలో కరోనా పేట్రేగి పోనుందని..
పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని.. ఫిబ్రవరి 25నే అమెరికా నేషనల్ సెంటర్
ఫర్ మెడికల్ ఇంటలిజెన్స్ విభాగం ట్రంప్‌ను హెచ్చరించిందట.
కానీ ఆయన
వాళ్ల సమాచారాన్ని లైట్ తీసుకున్నారు. కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని
లేదని ప్రకటన చేశారు. అప్పటికే షెడ్యూల్ అయిన భారత పర్యటన కోసం బయల్దేరి
వచ్చేశారు. తిరిగి స్వదేశానికి వెళ్లాక కూడా ట్రంప్ కరోనా కట్టడి గురించి
ఆలోచించలేదు. ఆ దేశంలో కరోనా కేసులు బయటపడ్డాక కూడా లాక్ డౌన్ లాంటి
చర్యలేమీ చేపట్టలేదు.
జనాల నిర్లక్ష్యం కూడా తోడై ఇప్పుడు కరోనా
అక్కడ విలయ తాండవం చేస్తోంది. మన దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి
వాళ్లు కూడా కరోనా గురించి తేలిగ్గా మాట్లాడి.. వారం తిరక్కుండానే తీవ్రతను
అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ ట్రంప్ మూర్ఖత్వంతో
నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టారన్నది
స్పష్టం.
This post was last modified on April 18, 2020 8:01 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…