Political News

మోడీకి సీఎం  స్టాలిన్ భారీ షాక్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

యూనివర్సిటీల వైస్ చాన్సెల‌ర్ల‌(వీసీ)లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాల్లో కోత విధించింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. ఈ ప‌రిణామం.. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌భుత్వంపై అంతో ఇంతో ఆధిప‌త్య ధోర‌ణితో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సూచ‌న‌ల మేర‌కు న‌డుస్తున్న గ‌వ‌ర్న‌ర్‌కు బిగ్ షాకేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి  ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బిల్లుపై మాట్లాడారు.

” సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్‌ వర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది“ అని స్టాలిన్ అన్నారు.

ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్లు గుర్తుచేశారు. ‘అంతెందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను గవర్నర్‌ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు’ అని స్టాలిన్‌ అన్నారు.

తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల సదస్సు  ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్‌ ప్రభుత్వం గవర్నర్‌ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. మ‌రి దీనిపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on April 26, 2022 12:20 pm

Share

Recent Posts

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

1 hour ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

2 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

2 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

7 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

9 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

11 hours ago