మాజీ ఎంపీ, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడుగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల పాటు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు.
అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో లగడపాటి బస చేశారు. మరుసటి రోజు ఉదయం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వైసీపీ వ్యవహారాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం విజయవాడ ఎంపీ స్థానం వైసీపీలో ఖాళీగా ఉంది. గత 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖ వ్యాపార వేత్త.. పీవీపీ.. తర్వాత.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. అయితే.. సీఎం జగన్‌కు మాత్రం ఆయన టచ్‌లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో లగడపాటి వైసీపీ నేతలతో టచ్‌లోకి రావడం ఆసక్తిగా మారింది. రేపు లగడపాటి కనుక వైసీపీలోక వస్తే.. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆయనకు కేటాయించే అవకాశం మెండుగా ఉందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఇక, లగడపాటి తన పర్యటనలో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు.
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నేత గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే.. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ, లగడపాటి సమయం చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందనే వార్తలు మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి.
This post was last modified on April 25, 2022 11:09 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…