నేతల మధ్య పంచాయితీలు ముదిరిపోకుండా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయకపోతే అవే పంచాయితీలు ముందు ముందు బాగా ముదిరిపోతాయని అందరికీ తెలిసిందే. పంచాయితీ సర్దుబాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిందిదే. నెల్లూరులో తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య విభేదాలు చాలాకాలంగా ఉన్నా ఎప్పుడూ బహిరంగం కాలేదు.
అయితే క్యాబినెట్లోకి అనిల్ బదులు కాకాణి చేరగానే విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు డైరెక్టుగా ఆరోపణలు, విమర్శలు చేసుకోకపోయినా వాళ్ళమధ్య విభేదాలున్నాయనే విషయం మాత్రం బయటపడ్డాయి. మంత్రయిన తర్వాత మొదటిసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన రోజే మాజీ మంత్రి అనిల్ నెల్లూరు పట్టణంలో తన మద్దతుదారులతో సమావేశం పెట్టారు.
ఒకవైపు పార్టీ ఆఫీసుకు కాకాణి వస్తున్నపుడు అనిల్ హాజరుకాకుండా అదే సమయంలో సొంతంగా సభ పెట్టుకోవటంతోనే వీళ్ళ మధ్య విభేదాలున్నాయని అర్థమైంది. అనీల్ మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తన నియోజకవర్గమైన సర్వేపల్లిలోకి అడుగుపెట్టనివ్వలేదని పార్టీలోనే ప్రచారంలో ఉంది. అంటే వాళ్ళ మధ్య విభేదాలు అంత స్థాయిలో ఉన్నాయి మరి. అలాంటిది ఇపుడు విభేదాలు లేవంటే ఎవరు నమ్ముతారు ? ఈ విషయం పెరిగి పార్టీకి నష్టం జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
ఇద్దరినీ పిలిపించి గట్టిగానే క్లాసు పీకినట్లు ప్రచారంలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాల వల్ల పార్టీ నష్టపోతుందన్న విషయాన్ని జగన్ గుర్తుచేశారట. ఇలాంటి విభేదాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని గట్టిగా చెప్పారట. దాంతో ఇద్దరూ తలూపి బయటకు వచ్చారట. గతంలో కూడా కాకాణి-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చినపుడు కూడా జగన్ క్లాసు పీకినట్లు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ క్లాసు తర్వాత వారిద్దరు మళ్ళీ నోరిప్పలేదు. అంటే ఇపుడు జరిగింది చూస్తుంటే వీళ్ళిద్దరికీ తీసుకున్న క్లాసు సరిపోతుందనే అనుకుంటున్నారు. వీళ్ళకి తీసుకున్న క్లాసు సరిపోయిందా లేదా అన్నది కొంతకాలం అయితే కానీ తేలదు.
This post was last modified on April 21, 2022 12:39 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…