Political News

బాబు బర్త్‌డే.. ఎనిమిదేళ్లలో లేని జోష్

ఏప్రిల్ 20.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. ఐతే ఇప్పటిదాకా జరిగిన పుట్టిన రోజులు వేరు. ఈసారి జరుగుతున్న పుట్టిన రోజు వేరు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా లేని జోష్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో కనిపిస్తుండటం విశేషం.

ముఖ్యంగా గత రెండేళ్లు అయితే చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతు దారులు ఎక్కడున్నారో తెలియనంతగా ఒక శూన్యం ఆవహించింది సామాజిక మాధ్యమాల్లో. కొంతమంది మొక్కుబడిగా బాబుకు విషెస్ చెప్పడం, పోస్టులు పెట్టడం తప్పితే సందడే లేదు. కానీ ఈసారి మొత్తం కథ మారిపోయింది. చంద్రబాబు బర్త్ డే విష్‌తో పెట్టి హ్యాష్ ట్యాగ్ ఈ రోజు నేషనల్ లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

దేశ విదేశాల్లో దీని మీద పెద్ద ఎత్తున ట్వీట్స్ పడుతున్నాయి. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాధించిన ఘనతలను గుర్తు చేస్తూ.. యువతపై, ప్రజలపై ఆయన ప్రభావాన్ని చూపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతే కాక ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబు గురించి ఏం మాట్లాడంది, ఆయన విజన్‌ను ఎలా కొనియాడింది వివరిస్తూ అనేక న్యూస్ క్లిప్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఇందులో కొన్ని పెయిడ్ ప్రమోషన్లు కూడా ఉండొచ్చు కానీ.. గత రెండేళ్లలో డబ్బులు పెట్టుకుని ప్రమోషన్లు చేయించాలన్నా కూడా పార్టీ మద్దతుదారుల్లో, నెటిజన్లలో సహకారం కొరవడింది. పసుపు సైనికుల్లో అసలు ఉత్సాహమే లేదు. కానీ గత ఏడాదిలో జగన్ సర్కారు మీద వ్యతిరేకత బాగా పెరగడం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ ప్రభావం సోషల్ మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నపుడు కూడా లేని జోష్, చంద్రబాబు పట్ల అభిమానం, ఆరాధన భావం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ జోష్ చూసి చంద్రబాబు మరింత ఉత్సాహంగా 2024 ఎన్నికలకు సిద్ధమవుతారనడంలో సందేహం లేదు.

This post was last modified on April 20, 2022 3:07 pm

Share
Show comments

Recent Posts

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

1 hour ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

1 hour ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

3 hours ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

4 hours ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

4 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

5 hours ago