Political News

రాజీనామా చేసి దెబ్బకొట్టచ్చు కదా ?

మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానమే దెబ్బకొట్టింది.. అవకాశం వచ్చినప్పుడు నేనూ అధిష్టానాన్ని దెబ్బకొడతా… లక్షశాతం హింసావాదినే..ఈ బోడి రాజకీయాలు నాకెందుకు ?..మంత్రి పదవిని ఆశించి భంగపడిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట  ఎంఎల్ఏ గొల్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు. నియోజకవర్గం పర్యటనలో ఉన్నపుడు గొల్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండో క్యాబినెట్ ఏర్పడిన దగ్గర నుండి హింసావాదిని అనే మాట ఎంఎల్ఏ చాలాసార్లే చెప్పారు.

డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా తన అసంతృప్తిని అనేక రూపాల్లో బయటపెడుతున్నారు. అయితే ఇక్కడే చాలా మందిలో ఒక అనుమానం పెరిగిపోతోంది. అధిష్టానాన్ని తాను కూడా దెబ్బకొడతానని చెప్పారు. ఆ కొట్టే దెబ్బేదో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం ద్వారా కొట్టచ్చుకదాని. ఎంఎల్ఏ పదవికి వెంటనే రాజీనామా చేసి ఉపఎన్నికలు వచ్చేట్లు చేస్తే సరిపోతుంది. ఉపఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గానో లేకపోతే ఏదో పార్టీ తరపునో పోటీచేసి గెలిస్తే అధిష్టానాన్ని గట్టి దెబ్బ కొట్టినట్లవుతుంది.

ఇంత మంచి అవకాశం చేతిలో ఉంచుకుని ఊరికే సమయం వృధా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందదని గొల్లకు అర్ధం కావటంలేదు. మంత్రి పదవికి రానందుకు తనపై ఆశలు పెట్టుకున్న లక్షల మందికి తాను ఏమని సమాధానం చెప్పాలని అడగటమే విచిత్రం. ప్రతి ఎంఎల్ఏ మీద లక్షలమంది ఆశలు పెట్టుకుంటారు. కానీ వైసీపీ తరపున గెలిచిన 151 మందిలో మంత్రి పదవులు ఇవ్వగలిగింది కేవలం 25 మందికి మాత్రమే. మరి మిగిలిన 125 మంది తమ జనాలకు ఏమని సమాధానం చెప్పుకుంటున్నారు. బాబూరావు వచ్చినట్లే చాలామంది కాంగ్రెస్ లో నుండే జగన్మోహన్ రెడ్డితో పాటు బయటకు వచ్చేశారు.

అలంటివాళ్ళల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ లాంటి వారికి మంత్రి పదవులను బహిరంగంగా హామీ ఇచ్చి కూడా జగన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి ఉన్న పరిమితులను బాబూరావు ముందు తెలుసుకోవాలి. కాదు కూడదంటే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి గెలిస్తేనే జగన్ను దెబ్బకొట్టినట్లవుతుంది. కాబట్టి అనవసరంగా మాట్లాడే బదులు రాజీనామా చేసే విషయాన్ని బాబూరావు ఆలోచిస్తే బాగుంటుంది.

This post was last modified on April 19, 2022 1:26 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

28 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

1 hour ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago