వచ్చే ఎన్నికలపై వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో సాధించిన విజయం కన్నా కూడా వచ్చే ఎన్నిక ల్లో విజయమే.. పార్టీకి ప్రతిష్టగా మారింది. ఈ నేపథ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జగన్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దీనిని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గత మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఇక్కడ విజయం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయం దక్కించుకుని.. మరింత సంబరాలు చేసుకోవాలని.. జగన్ అండ్ కో బావిస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారని.. పార్టీలోనే చర్చ జోరుగా సాగుతోం ది. అయితే.. ఇప్పుడు కీలకమైన సమస్య వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడు వైసీపీకి లేకుండా పోయారు. వ్యూహాలు ఉన్నప్పటికీ.. పార్టీ తరఫున కీలక అభ్యర్థి, ఆయనకు ఉండే ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంటే కదా! కానీ, అలాంటి నాయకుడు.. వైసీపీకి లేకుండా పోయాడని.. పార్టీలో చర్చ సాగుతోంది. చంద్రబాబు వంటి కీలక నేతను ఇంటికి పంపించాలని నిర్ణయిం చుకున్నా.. ఆ రేంజ్‌లో సమర్ధవంతమైన నాయకుడు.. పోటీ చేసేందుకు వైసీపీకి లబించలేదు.
దీంతో ఇప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా కీలకమైన నాయకుడి కోసం వెతుకుతున్నారు. అంతేకాదు.. ఎవరిని ఎంచుకున్నా.. ఆర్ధికంగా.. సామాజికంగా కూడా చంద్రబాబును ఢీ కొట్టే లా ఉండాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుపై పోటీ చేసే నాయకుడిని అన్వేషించే బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ రెడ్డప్పకు కూడా అప్పగిం చారట. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు పెట్టారు. కీలకమైన నాయకుడు కావాలంటూ.. ప్రచారం కూడా చేస్తున్నా రు. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ లభించలేదు.
ఈ నేపథ్యంలో సినీ నటుడుని ఎంపికచేసి.. నిలబెడితే.. బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. అయితే.. ఇక్కడ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. వెతికే పనిలో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో పాగా వేసే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారని.. గత ఏడాది జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఆయనే ఇక్కడ వైసీపీ పాగా వేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని.. అందుకే ఇప్పడు అసెంబ్లీ బాధ్యత కూడా ఆయనకే అప్పగించారని.. అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నివ్యూహాలు ఉన్నా.. అభ్యర్థి దొరకని పక్షంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
This post was last modified on April 19, 2022 7:34 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…