ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి పదవులు దక్కనివారి అసంతృప్తి తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మళ్లీ అసంతృప్తి జ్వాలలు తెరమీదికి వచ్చాయి. ఇటీవల తన తఢాకా చూపిస్తానంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విశాఖ జిల్లా రిజర్వడ్ నియోజకవర్గం పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు.. తాజాగా మరోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జగన్‌ను దెబ్బకు దెబ్బ కొడతానంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే.. తనను జైల్లో పెట్టాలంటూ.. వైసీపీ అధిష్టానానికి ఆయన సవాల్ చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను అమాయకుణ్ణి కాదని.., తన హింసావాదం ఏమిటో తర్వలోనే చూపిస్తానని హెచ్చరించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల మండలంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను హింసావాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరానన్నారు.
వైసీపీకి, జగన్‌కు దెబ్బకు దెబ్బ కొడతామని.. తన హింసావాదం ఏమిటో త్వరలోనే చూపిస్తానని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఆ బోడి రాజకీయాలు నాకెందుకయ్యా. ఓ మాట కోసం వైసీపీలో చేరాను. నేను నిజంగా నూటికి లక్ష పర్సెంట్ హింసావాదినే. నేను మీరనుకున్నంత సాఫ్ట్ కాదు. అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా హింసావాదంతో వైసీపీలో చేరా. బలమైన జాతీయ క్రాంగెస్ పార్టీని కూడా లెక్కచేయలేదు. వీళ్ల కోసం ఇన్ని త్యాగా లు చేస్తే.. నా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి?” అని బాబూ రావు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో తన మీద ఎంతోమందికి ఆశలున్నాయన్న ఆయన “వాళ్లనుకుంటున్నారేమో(వైసీపీ అధిష్టానం).. నేను అమాయకుడిని కాదు. హింసావాదిని. ఈ మాట లక్ష మంది పబ్లిక్ మీటింగ్లో చెబుతా. నాకేం భయం లేదు. కావాలంటే జైళ్లో పెట్టమను.” అని బాబూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో నాలుగు రోజులకిందట నిర్వహించిన సమావేశంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరింత రెచ్చిపోయారు. మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు అలిగిన వారిని తాడేపల్లికి పిలిచి బుజ్జగించిన అధిష్టానం.. బాబూరావును మాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మరింత ఆగ్రహంతో ఉన్నారని పరిశీలకులు బావిస్తున్నారు.
This post was last modified on April 18, 2022 10:41 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…