జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో కొందరు మంత్రులు వివాదాలతో తమ బాధ్యతలను మొదలుపెట్టారు. వివిధ కారణాలపై ఐదుగురు మంత్రులపై వివాదాలు ముసురుకున్నా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ పై వస్తున్న వివాదాలు తీవ్రమైనవే. కాకాణిపై గతంలోనే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో ఉన్నాయి.
ఎప్పుడైతే కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే కోర్టులో దొంగలు పడి ఆధారాలని చెబుతున్న మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లాంటి వాటిని ఎత్తుకెళ్ళారు. కోర్టులోనే దొంగలు పడటం, అందులోను కాకాణి ఎదుర్కొంటున్న కేసులోని ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారం సంచలనంగా మారింది. సహజంగానే అందరి చూపులు ఇపుడు మంత్రి మీదే నిలిచాయి. కాకాణే ఆధారాలను దొంగతనం చేయించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఇదంతా కాకాణి ప్రత్యర్ధులపనే అంటు మంత్రి మద్దతుదారులు గట్టిగా వాదిస్తున్నారు. ప్రత్యర్ధులంటే ఎవరనే విషయం మెల్లిగా తెలుస్తుంది. ఏదేమైనా దర్యాప్తులో అన్నీ విషయాలు బయటపడతాయి. ఇక ఉషశ్రీ చరణ్ కు స్వాగతం చెప్పే నేపథ్యంలో ట్రాఫిక్ నిలిపేసిన కారణంగా ఒక చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. అయితే జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాత్రం అదంతా తప్పుడు ఆరోపణలుగా కొట్టేశారు. బాధితుడు తన కూతురుని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిన సీసీ కెమెరాల ఫుటేజీని మీడియాకు చూపించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక సార్లు కోర్టులో డీజీపీ నిలబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నా జనం నమ్మడం లేదు.
ఇక దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు నిజంగా వివాదంతో సంబంధంలేదు. కానీ వివాదానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం మంత్రే. ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అత్యుత్సాహంతో జగన్ ను ఆరాధించండని చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమయ్యాయి. చివరగా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు షేక్ హ్యాండిచ్చిన ఓ కార్యకర్త మంత్రి చేతిని గట్టిగా పిసికేశాడు. దాంతో మంత్రికి మండిపోయి సదరు కార్యకర్తపై చేయిచేసుకున్నారు.
This post was last modified on April 17, 2022 12:38 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…