ఏపీలో కొత్తగా పదువులు చేపట్టిన జగన్ కేబినెట్ 2.0లోని మంత్రులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులూ ఖబడ్దార్
అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గడిచిన రెండు రోజుల్లో కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు చేసిన నిర్వాకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రుల విషయంలో చంద్రబాబు మరింత ఫైరయ్యారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తి దేవాలయంలో చూపిన అత్యుత్సాహంతో పదుల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోనే స్పృహతప్పి పడిపోయారని.. ఇంత అత్యుత్సాహం ఎందుకని.. నిలదీశారు. మంత్రి అయితే.. మాత్రం సామాన్య భక్తులకు విలువ ఇవ్వరా? అని నిలదీశారు.
ఇక, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ సందర్భంగా వాహనాలు నిలిచిపోయి.. ఆస్పత్రికి వెళ్తున్న చిన్నారి మృతిచెందడంపైనా చంద్రబాబు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటంతో పసిబిడ్డ ప్రాణాలు పోవడం కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే సకాలంలో వైద్యం అందక చిన్నారి ప్రాణాలు విడిచిందని విమర్శించారు.
అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెబుతారని చంద్రబాబు మండిపడ్డారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే చిన్నారి కన్నుమూసిం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంత్రి బాధితులను పరామర్శించ లేదని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా.. ఏపీ మంత్రులు ప్రజల కోసం పనిచేయాలనే స్పృహలోకి రావాలని.. చంద్రబాబు హెచ్చరించారు. మంత్రుల తీరు మారకపోతే.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
అనంతపురం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తుందని.. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు.. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆ వాహనం ట్రాఫిక్లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో… ఆ చిన్నారి మృతి చెందింది.
This post was last modified on April 17, 2022 12:34 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…