తెలంగాణలో ప్రస్తుతం జోరుమీదున్న ప్రధాన పార్టీలు ఏవి అంటే.. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల పేర్లు వినిపిస్తాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలు చేస్తుండడంతో ఆ పార్టీలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఆప్ పాదయాత్ర మొదలెట్టింది. మరి తెలుగు దేశం పార్టీ అనే పేరు ఎక్కడైనా వినిపిస్తుందా? అంటే లేదనే సమాధానాలే వస్తున్నాయి. అలాంటిది తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎదగాలంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మునిగిన పడవ..
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారింది. ఇప్పుడు మునిగిన పడవలాగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీకి దారుణ ఫలితాలు వచ్చాయి. ఏదో కాస్తో కూస్తో పట్టున్న హైదరాబాద్‌లోనూ పార్టీ ఖాళీ అయింది. ఇక్కడ పార్టీని నడిపించే సమర్థుడైన నాయకుడు లేడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీడలా వ్యవహరించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. ఎల్.రమణ కారెక్కేశారు. ఇక పేరున్న నేతలు పెద్దగా పార్టీలోనే లేరు. బాబు పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
పోటీలోకి వస్తుందా?
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎదగాలని తాజాగా ఇక్కడి రాష్ట్ర నేతలతో సమావేశంలో బాబు సూచించారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు బలహీనపడిందన్నది నిజమని.. కానీ భవిష్యత్‌లో తిరిగి పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 27 నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జీలను ప్రకటించారు. అయితే ఇప్పటికే తెలంగాణలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర షురూ చేశారు. కాంగ్రెస్ కూడా అగ్రనేత రాహుల్ గాంధీని రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా.. ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ ఎలా పుంజుకుంటుందన్నది బాబే చెప్పాలని అంటున్నారు. ఏదో మూడ్ వచ్చినప్పుడు ఓ సారి అలా తెలంగాణపై ఆయన దృష్టి పెడతారని తర్వాత అంతా మర్చిపోతారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎదుగుతుందని బాబు అనుకోవడం కల అని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on April 16, 2022 3:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…