Political News

నిధులు లేక‌.. వైసీపీ నాయ‌కుల క‌న్నీళ్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌మ‌స్య‌గా మారింది. అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్ట‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వ రోజువారీ కార్య‌క‌లాపాలు సాగించాలన్నా రుణాలు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి తలెత్తింద‌ని ఆరోపిస్తున్నాయి.

సంక్షేమ ప‌థకాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్న జ‌గ‌న్‌.. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడో మ‌ర్చిపోయారంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు మండిప‌డుతున్నాయి. అస‌లు నిధులు ఉంటేనే క‌దా అభివృద్ధి చేసేద‌ని ఎద్దేవా చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు కూడా వైసీపీ ప్ర‌భుత్వ తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సొంత పార్టీ నేత‌లు త‌మ డ‌బ్బుల‌తో అభివృద్ధి ప‌నులు చేయిస్తే ఇప్పుడు వాటికి బిల్లులు రావ‌డం లేద‌ని స్వ‌యంగా వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. అభివృద్ధి ప‌నులు చేసి వాటి బిల్లులు రాక ఇబ్బందులు ప‌డుతున్న త‌మ నాయ‌కుల్ని చూస్తుంటే క‌న్నీళ్లు వ‌స్తున్నాయ‌ని ఎన్టీఆర్ జిల్లా మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సుమారు రూ.200 కోట్ల ప‌నుల‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మైల‌వ‌రం పంచాయ‌తీ ఉప స‌ర్పంచ్ సీతారెడ్డి రూ.2.5 కోట్ల అభివృద్ధి ప‌నులు చేశార‌ని ఎమ్మెల్యే తెలిపారు. కానీ బిల్లులు ఆల‌స్యం కావ‌డంతో త‌న‌కున్న 5 ఎక‌రాల మామిడి తోట‌ను సీతారెడ్డి అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డ్డారు. ఈ విష‌యం త‌న దృష్టికి రావ‌డంతో ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వ‌గ్రామంపై ప్రేమ‌తో బిల్లులు ఆల‌స్య‌మైనా సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి ప‌నులు పూర్తి చేశాన‌ని ఆయ‌న చెప్ప‌డంతో క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని కృష్ణ‌ప్ర‌సాద్ బాధ‌ప‌డ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. అభివృద్ధి ప‌నులు చేయించి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట‌ర్లు ఎలాంటి బాధ‌లు అనుభ‌విస్తున్నారో తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఏపీలో ప్ర‌భుత్వ ప‌నులు చేస్తే ఏళ్ల త‌ర‌బ‌డి బిల్లుల‌కు నోచుకోని ప‌రిస్థితి ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల త‌మ‌కు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్ట‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు కూడా ఆ బాధితుల జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ పెండింగ్ బిల్లుల విష‌యంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on April 14, 2022 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

40 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

40 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

1 hour ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago