ఏపీ సీఎం జగన్‌పైటీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జనాల్ని ఇలా బాదేస్తారా? అని నిలదీశారు. ముఖ్యమం త్రి జగన్ ‘బాదుడే బాదుడు’ చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు.
ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం తన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం. డీజిల్ సెస్ పేరుతో చేసిన ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలి. అధికారంలోకి వచ్చాక రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమే. ప్రతి వారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాటుగా మారింది. ఇప్పటికే విద్యుత్, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు.
అని బాబు వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, ఏపీ సర్కారు డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండడం గమనార్హం.
This post was last modified on April 14, 2022 7:56 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…