2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి మద్దతుగా నిలిచి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పాటు అందించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే ఇందుకు గాను పవన్ ఎలాంటి ప్రతిఫలం అందుకోలేదన్నది స్పష్టంగానే కనిపిస్తుంటుంది. ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. తనకో, తన పార్టీ వాళ్లకో ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవో ఇప్పించుకోలేదు.
ఇక తెర వెనుక డబ్బులు పుచ్చుకునే వాడే అయితే పార్టీ నడపడం కోసం ఆసక్తి లేకున్నా, అతి కష్టం మీద వీలు చేసుకుని సినిమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక టీడీపీకే కొమ్ముకాసేవాడే అయితే.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రభుత్వం మీద విమర్శలు చేసి, పోరాటాలకు దిగేవాడే కాదు. అయినా సరే.. జనసేనాని ప్యాకేజీ తీసుకున్నాడని, చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడని విమర్శలు చేస్తుంటారు వైకాపా వాళ్లు.
ఐతే ఇన్నాళ్లు ఇలా ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడీ విషయమై దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను పరామర్శించేందుకు, వారికి రూ.లక్ష చొప్పున జనసేన తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అక్కడి మీడియాతో మాట్లాడాడు. తనను వాళ్లకు వీళ్లకు దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించాడు.
ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల మీద మాట్లాడితే.. ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించాడు పవన్. ఈ అనంతపురం నుంచే వైసీపీ అగ్ర నాయకత్వానికి చెబుతున్నా.. ఇంకొక్కసారి గనుక నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్ ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. వాళ్ల పార్టీలోని చాలా మంది ముఖ్య నాయకులను సీబీఐ దత్తత తీసుకుంటోంది. ఆ విషయం మర్చిపోవద్దు.
2019 ఎన్నికల నుంచి మీరు జనసేన పార్టీని టీడీపీకి బీ- టీమ్ అంటున్నారు. దీనిపై ఏదన్నా గట్టిగా మాట్లాడితే మీరు ఏడుస్తారని ఊరుకున్నా. ఇక నాకు కూడా సహనం పోయింది. ఇకపై మమ్మల్ని గనుక బీ- టీమ్ అన్నారంటే మిమ్మల్ని ‘చర్లపల్లి జైల్ షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైలులో చక్కగా 16 నెలలు షటిల్ ఆట ఆడుకున్నారు. మీరేమీ దేశ సేవ చేయలేదు. మీరేమీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లు కాదు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడి జైల్లో కూర్చున్నవాళ్లు. మీరు మాకు నీతులు చెప్పకండి. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. అసలు ఆ స్థాయి కూడా లేదు మీకు అని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
This post was last modified on April 12, 2022 7:15 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…