సీఎం జగన్ తన మంత్రి వర్గ కూర్పులో.. సరైన ప్రమాణాలు పాటించలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న సమయంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి న ఆయన ఈ దఫా మంత్రి వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వచ్చేది కీలకమైన ఎన్నికల నామ సంవత్సరం కావడంతో.. ఖచ్చితంగా ఈ రెండేళ్లలో ఆయా సామాజిక వర్గాలను సాధ్యమైనంత వరకు ప్రభావితం చేస్తారని.. అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గ కూర్పుపై అన్ని సామాజిక వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
అయితే.. ఊహించని విధంగా సీఎం జగన్.. మంత్రి వర్గ కూర్పులో కీలకమైన నాలుగు సామాజిక వర్గాల ను.. పక్కన పెట్టేశారు. వీటిలో అత్యంత కీలకమైన కమ్మ సామాజికవర్గం ఉండడం గమనార్హం. అంతేకా దు.. వైశ్య సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టారు. గత మంత్రి వర్గంలోఈ రెండు వర్గాలకుచెందిన కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌కు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ దఫా వీరిని పక్కన పెట్టడంతో పాటు.. కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. ఇక, మరో కీలకమైన సామాజిక వర్గం.. క్షత్రియ. ఈ వర్గం నుంచి గత కేబినెట్‌లో శ్రీరంగనాథరాజు ఉన్నారు.
అయితే… ఈయన స్థానంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుకు అవకాశం కల్పిస్తారని.. ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రసాదరాజు కూడా.. ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఆయనను కూడా పక్కన పెట్టారు. ఇక, బ్రాహ్మణ సామాజిక వర్గానికి గత కేబినెట్లోనూ చోటు దక్కలేదు. దరిమిలా.. ఇప్పుడైనా.. చోటు దక్కుతుందని ఆశించారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఉన్నారు. అయితే.. వీరిలో మల్లాదికి ఖచ్చితంగా మంత్రి పీఠం దక్కుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయనను కూడా పక్కన పెట్టారు.
అంతేకాదు.. ఈ నాలుగు సామాజిక వర్గాల నుంచి ఎవరినీ తీసుకోకపోవడం గమనార్హం. ఇది .. జగన్ కూర్పుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు.. కొత్త ముఖాలైన విడదల రజనీ కి అవకాశం కల్పించడంపై.. గుంటూరు రాజకీయం గరంగరంగా మారిపోయింది. ఇక్కడే మరో విషయం చర్చకు వస్తోంది. ఈ కోసం సీటు త్యాగం చేసిన కమ్మనాయకుడు.. సీనియర్ నేత.. మర్రి రాజశేఖర్‌ను అసలు జగన్ ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికిఆయన కోరకుండానే మంత్రి పదవి ఇస్తానని.. జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు.
This post was last modified on April 10, 2022 9:20 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…