దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నుండి గౌతమ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించటంతో ఇపుడా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ నడిచింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ కు మేకపాటి ఫ్యామిలి తెరదించింది. గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
మేకపాటి సోదరుల తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డికి కబురందింది. తొందరలో జరగబోయే ఆత్మకూరు ఉపఎన్నికలో తన కొడుకు విక్రమ్ రెడ్డిని పోటీచేయించాలని తమ కుటుంబం నిర్ణయించినట్లు రాజమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ నిర్ణయం తమ కుటుంబం అంతా మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయంగా మాజీ ఎంపీ ప్రకటించారు. దాంతో ఆత్మకూరు సస్పెన్స్ విడిపోయింది.
మొదట్లో గౌతమ్ స్థానంలో ఆయన భార్య శ్రీ కీర్తి రాజకీయాల్లోకి వస్తారని, ఆత్మకూరు నుండి పోటీచేయబోతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఇలా పోటీచేసేయటం అలా గెలిచొచ్చి మంత్రయిపోవటమే మిగిలుందన్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే జరిగిన ప్రచారానికి విరుద్ధంగా శ్రీ కీర్తికి బదులు విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
విక్రమ్ చెన్నై ఐఐటీలో చదువుకుని అమెరికాలో కన్ స్ట్రక్షన్ టెక్నాలజీలో ఎంఎస్ చేశారు. అంటే సోదరుడు గౌతమ్ లాగే విక్రమ్ కూడా బాగా చదువుకున్న వ్యక్తే. ఎలాగూ కుటుంబం తరపున విక్రమ్ పేరు జగన్ కు అందింది కాబట్టి అభ్యర్ధిగా అధికారికంగా పేరును ప్రకటించటం లాంఛనమే అనటంలో సందేహం లేదు. ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా విక్రమే అభ్యర్ధిగా పోటీలోకి దిగటం ఖాయం.
ఇంతవరకు ఓకేనే కానీ తర్వాత మంత్రివర్గంలోనే ఉంటారా లేదా అనేదే సస్పెన్స్. ఎందుకంటే 11వ తేదీన మంత్రివర్గం ఏర్పాటవుతోంది. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. అయితే ఉపఎన్నికలతో సంబంధంలేకుండా కూడా విక్రమ్ ను జగన్ మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. కానీ అలా చేస్తారని అనుకోవటం లేదు.
This post was last modified on April 10, 2022 6:31 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…