తాను అనుకున్నట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కొత్త కేబినెట్ ను కొలువు తీర్చిన వేళలో మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని.. కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన జగన్ అందుకు తగ్గట్లే.. పాత వారందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించటం తెలిసిందే. కొత్తగాకొలువు తీరే కేబినెట్ సైజు పాతిక మంది కాగా.. వారిలో కొత్త వారు ఎంతమంది? పాతవారు ఎంతమంది? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సోమవారం ఉదయం 11 గంటల వేళలో జరిగే మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించి ఈ రోజు (ఆదివారం) సాయంత్రం లోపు మంత్రుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొత్తం పాతిక మందిలో పది మంది పాత వారు కొనసాగుతారని.. కొత్తగా 15 మందికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. అనుకున్న దాని కంటే ఆలస్యంగా సాగిన కేబినెట్ కూర్పు కసరత్తు.. శనివారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాను రాజ్ భవన్ కు పంపటానికి ముందు చివరిక్షణాల్లో ఏదైనా జరిగితే మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
తొలుత అందిన సమాచారాన్ని చూసినప్పుడు పాత కేబినెట్ లోని ఐదారుగురికి మించి అవకాశం దక్కదన్న మాట వినిపించింది. కానీ.. అంతలోనే మార్పులుచోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. శుక్ర.. శనివారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. జగన్ తో భేటీ అయిన కొందరి కారణంగా ఆయన మైండ్ సెట్ లో కాసిన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.దీంతో.. మొత్తం పాతిక మందిలో పదిహేను మంది మాత్రమే కొత్త వారు ఉంటారని చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాలేదని.. శనివారం మొత్తం కసరత్తు చేసిన తర్వాత కూడా జగన్ ఒక నిర్ణయానికి రాలేకపోయారని.. దీంతో ఆయన ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నానికి జాబితాను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి తన కొత్తకేబినెట్ లో కొత్త వారుఎంతమంది ఉండాలి.. పాత వారు ఎంత మంది కంటిన్యూ కావాలన్న దానిపై మాత్రం క్లారిటీకి వచ్చారని చెబుతున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాలు నిజమైతే.. మొత్తం 25మందిలో 40 శాతం మంది పాత వారు.. 60 శాతం మంది కొత్త వారు వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 10:26 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…