ఏపీలో నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం దాదాపుగా తేల్చి చెప్పింది. ఇక, ఏపీలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయాలన్న అంశానికి మాత్రం సీఎం జగన్ కట్టుబడే ఉన్నారు.
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా చేసుకొని జిల్లాల విభజన చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ హామీని అమలు చేయాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. కొత్త జిల్లాల రూట్ మ్యాప్ పూర్తి చేసి 2021 రిపబ్లిక్ డే నాటికి ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రిపబ్లిక్ డే నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలనను అమలులోకి తేవాలని జగన్ యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేశారని తెలుస్తోంది. జిల్లాల విభజనలో భాగంగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించాలని చూస్తున్నారట. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేయాలని కూడా జగన్ ఫిక్స్ అయ్యారట.
పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా.. జిల్లాకో మంత్రి…ఉండాలని జగన్ యోచిస్తున్నారట. దీని వల్ల పాలనా సౌలభ్యం, స్థానిక రాజకీయాలను మరింత దగ్గరుండి గమనించడం వంటివి సులువుగా ఉంటాయని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారట.
పాదయాత్రలో ఇదే విషయమై ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఈ విధంగా టీడీపీకి గ్రిప్ ఉన్న ఆ జిల్లాను తమ వైపు తిప్పుకోవాలని జగన్ అనుకుంటున్నారట. ముందుగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్
పేరు పెడితే…జిల్లాల విభజనలో నిమ్మకూరు ఎటు వెళుతుందో తెలీదని, అందుకే విభజన తర్వాత నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ ఆలోచన ఇదేనని తెలుస్తోంది. మరోవైపు, విశాఖలో ఒక జిల్లాను గిరిజన జిల్లాగా మార్చి దానికి విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జగన్ యోచిస్తున్నారట. దాదాపుగా అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టే అవకాశముందని అంటున్నారు. దీంతోపాటు, రాష్ట్రంలోని మరికొన్ని కొత్త జిల్లాలకు ఆయా ప్రాంత ప్రముఖుల పేర్లు పెట్టాలని కూడా వైసీపీ ఆలోచిస్తోందిట.
This post was last modified on June 21, 2020 1:24 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…