Political News

గ‌తిలేక‌.. ఉద్యోగుల‌తో బేరం ఆడాం

ఏపీలో ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏర్ప‌డిన పీఆర్సీ వివాదం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్‌కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే 27 శాతం ఐఆర్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని పేర్ని నాని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ అంశంలో ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని   నాని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికా రంలోకి రావడంలో ఉద్యోగులు చాలా కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే సీఎం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో న్యాయం జరగలేదని కొందరు అంటున్నా రని.., అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితే బాగాలేదనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాలనకు రెవెన్యూ అవసరమన్నారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2019 నాటి అప్పల భారం ఇప్పటి ప్రభుత్వంపై పడుతోందని బుగ్గన తెలిపారు.

పీఆర్సీ అమలు చేయగలగుతామనే సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేం దుకు పార్టీలు వస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు అన్నీ కలిపినా ఉద్యోగుల జీతాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇబ్బందులు ఉన్నా.. రెవెన్యూ తీసుకురావటంలో వాణిజ్య పన్నులశాఖ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. లొసుగులు వెతికి అదనపు ఆదాయాలు తీసుకురావాల్సిన బాధ్యత వాణిజ్య పన్నుల శాఖదేనని చెప్పారు. వ్యాపారులను వేధించాల్సిన అవసరం లేదని.. ఐదేళ్ల కాలంలోని వివాదాలు, కోర్టు కేసులు బేరీజు వేసుకుని నిబంధనల మార్పుపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు.

This post was last modified on April 7, 2022 7:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బొబ్బిలి సింహంతో బొబ్బిలి రాజా కబుర్లు

కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్…

15 minutes ago

OG విన్నపం – ఫ్యాన్స్ సహకారం అవసరం!

పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…

2 hours ago

శంకర్ & సుకుమార్ చెప్పారంటే మాటలా

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…

2 hours ago

మెడిక‌ల్ స‌ర్వీసులో ఏఐ ప‌రిమ‌ళాలు.. బాబు దూర‌దృష్టి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సాంకేతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రైతుల‌కు సంబంధించిన అనేక విష‌యాల్లో…

2 hours ago

సల్మాన్‌తో డేట్ చేశారా? : ప్రీతి షాకింగ్ రిప్లై!

బాలీవుడ్లో చాలామందితో ప్రేమాయణం నడిపిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ సహా ఈ జాబితాలో…

5 hours ago