చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన.. సీనియర్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వర రావుకు.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెగాసస్ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వానికి.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఉందని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని గుర్తు చేశారు.
“ మీరు(ప్రబుత్వం) రూల్ 6 గురించి అడుగుతున్నారు. నేను రూల్ 17కు అనుగుణంగానే మీడియాతో మాట్లాడా“ అని ఆయన పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకత, జవాబుదారీత నంతో ఉండాలని… ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెబుతున్నాయని ఏబీవీ స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదన్న ఏబీవీ… తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టంచేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ను కూడా తన వివరణలో ఏబీవీ ప్రస్తావించారు.
ఇదిలావుంటే, ఏబీవీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. ఏబీవీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించలేదని నోటీసులో పేర్కొంది.
మెమో అందిన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేనిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఏబీవీ మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 31న ఏబీవీ మీడియా సమావేశంలో పెగాసస్‌తోపాటుగా తన సస్పెన్షన్ అంశాలపై మాట్లాడారు. తాజాగా ఆయన ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన జవాబు చెప్పారు.. మరి ఇప్పడు సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on April 7, 2022 12:51 am
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…