ఏపీలో అధికార పార్టీ మద్దతుతో సర్పంచులుగా ఎన్నికైన.. నాయకులు రోడ్డెక్కారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కారణం.. గ్రామాలకు కేటాయించిన నిధులను జగన్ ప్రబుత్వం వాడేసుకోవడమే. దీంతో ఇప్పుడు వైసీపీ మద్దతుదారులైన సర్పంచులే రోడ్డెక్కి హాహాకారాలు చేస్తున్నారు.
వికేంద్రీకరణ.. ఇదే మా ప్రభుత్వ మాట..బాట. 3 రాజధానుల ప్రకటనప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటప్పుడూ ఇలా ప్రతీ సందర్భంలోనూ ఇదే ప్రస్తావన. మరి ఇంతలా చెబుతున్న సర్కార్.. వికేంద్రీకరణకు ఆయువు పట్టైన పంచాయతీలను మాత్రం గాలికొదిలేసింది. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన చేయూతను ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లతో పాటు పన్నులతో వచ్చిన ఆదాయాన్ని లాగేసుకుంటోంది. ఫలితంగా పల్లె అవసరాలు తీర్చాల్సిన పంచాయతీలు చేతిలో పైసా నిధుల్లేక అల్లాడుతున్నాయి. పైగా సర్పంచ్ పదవులను నామమాత్రం చేస్తూ.. సచివాలయాలకే వైసీపీ సర్కార్ పూర్తి పెత్తనం అప్పజెప్పింది.
గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలనా వికేంద్రీకరణ సాధ్యమవుతుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుం టోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ. 12 వందల 45 కోట్ల లాగేసుకుంది. ఇంటి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలంటూ సర్పంచులు, పంచాయతీ సిబ్బంది మెడపై కత్తిపెట్టి వసూలు చేయించిన సొమ్మును ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి పేరిట ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 2 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం.. పంచాయతీలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం వికేంద్రీకరణ ఎలా అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీ నిధులు ప్రభుత్వం దొంగిలించిందంటూ విజయవాడలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులు గ్రామాలకు జగన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల హక్కులను రక్షించాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం కేటాయించిన రూ.10 వేలకోట్లు జగన్ ప్రభుత్వం… గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల హక్కులను రక్షించాలంటూ నినాదాలు చేశారు. సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను జీరో చేసిందని సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
నాలుగు నెలల క్రితం 14,15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ.7,660 కోట్లను దారి మళ్లించారని మండిపడ్డారు. డబ్బంతా ఎటు పంపారు… ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కా పత్రం లేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో 12,900 సర్పంచుల వద్ద చిల్లి గవ్వ కూడా లేదని… గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి కోసమే భిక్షాటన చేస్తున్నామంటున్న సర్పంచులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
This post was last modified on April 6, 2022 4:44 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…