కరోనా టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కేసులు బయటపడతాయన్నది చాలా సింపుల్ లాజిక్. తెలంగాణలో ఇంతకుముందు తక్కువ టెస్టులు చేేసేవాళ్లు. కేసులు కూడా తక్కువగానే ఉండేవి. కానీ కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్లే కరోనా కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు 50-100 మధ్య కేసులకే అమ్మో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. నంబర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిన్న తెలంగాణలో రికార్డు స్థాయిలో 499 కేసులు వెలుగు చూశాయి. దీనికే అందరూ షాకైపోయారు. ఐతే శనివారం కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. తొలిసారిగా 500 మార్కు దాటింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం శనివారం 546 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
శనివారం 3500కు పైగా టెస్టులు నిర్వహించగా.. ఏకంగా 1100 దాకా కొత్త కేసులు బయటపడ్డట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూశారు. ఐతే ప్రభుత్వ బులిటెన్లో అందులో సగం కేసులే నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 80 శాతం పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపుగా ప్రతి ఏరియాలోనూ కరోనా కేసులున్నాయి. కాలనీలో అక్కడక్కడా ఉన్న కేసులు ప్రతి అపార్ట్‌మెంట్‌కూ విస్తరించే స్థాయికి వచ్చేశాయి. టెస్టులు చేస్తే దాదాపుగా ప్రతి వంద మీటర్లలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 వేల మార్కును దాటగా.. 3500 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. 3360 కేసుల దాకా యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య 200 మార్కును దాటింది. మొత్తం ఇప్పటిదాకా కరోనా వల్ల 203 మంది చనిపోయారు.
This post was last modified on %s = human-readable time difference 12:20 am
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…
కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…