క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు బలపడుతున్నాయి. గవర్నర్ తమిళిసైకి కేసీయార్ కు మధ్య బాగా గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎంత గ్యాప్ వచ్చేసిందంటే చివరకు గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను కూడా ఉన్నతాధికారులు పాటించటంలేదు. ఈ నేపధ్యంలోనే ఉగాది వేడుకల రాజ్ భవన్లో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఉగాది సందర్భంగా అయినా వివాదాలను పరిష్కరించుకుందామని గవర్నర్ ప్రయత్నించారు.
అయితే కేసీయార్ ఆ ప్రయత్నాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఉగాది వేడుకలకు హాజరవ్వాల్సిందిగా గవర్నర్ ప్రగతి భవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపారు. అలాగే మంత్రులు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ పంపారు. శుక్రవారం వేడుకలకు కేసీయార్ హాజరవుతారనే అందరు అనుకున్నారు. కానీ సీఎం మాత్రం హాజరుకాలేదు. దాంతో మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పెద్దగా హాజరుకాలేదు.
ఎప్పుడైతే కేసీయార్ వేడుకలకు హాజురుకాలేదో ఉన్నతాధికారులు కూడా పెద్దగా కనబడలేదు. సో తాజా పరిణామాలతో ఏమర్ధమైందంటే గవర్నర్-కేసీయార్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిందని. ఇదే అదునుగా బీజేపీ, కాంగ్రెస్ చీఫులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి తదితరులు మాత్రం ఫుల్లు జోషులో కనిపించారు. కేసీయార్ వేడుకలకు రావటంలేదని తెలియటంతో వీళ్ళతో పాటు ఇతర ప్రతిపక్షాలకు చెందిన నేతలు రెచ్చిపోయారు.
వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవటానికి ఇద్దరిలోను తప్పులున్నాయి. ఎంఎల్సీ నియామకంపై కేసీయార్ సిఫారసును గవర్నర్ పక్కనపడేశారు. ఏ గవర్నర్ కూడా ఇలాగ చేయరు. కానీ మహారాష్ట్రలోను, తెలంగాణాలోనే ఇలాగ జరిగింది. ఎన్ని నెలలైనా సీఎంవో నుండి ఫైలుకు గవర్నర్ కార్యాలయం మోక్షం ప్రసాదించలేదు. దాంతో కేసీయార్ కు మండిపోయింది. అప్పటి నుండే ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది. అలాగే గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా దక్కటంలేదు. ఇది కచ్చితంగా కేసీయార్ తప్పే. దాంతో గ్యాప్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సిన ఇద్దరు పంతాలకు పోయి పెంచుకుంటున్నారు.
This post was last modified on April 2, 2022 1:43 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…