ఏపీలో రాజకీయం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట మీడియా ముందు, అలాగే టీవీ ఛానెళ్ల చర్చల్లో రాజకీయ నాయకులు ఎంతగా అదుపు తప్పి పోతున్నారో తెలిసిందే. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకైతే అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే వాళ్లు చేసిన అనేక వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. జుగుప్స కలిగించే మాటలతో రాజకీయాలపై జనాలకు మరింత ఏహ్యభావం కలిగేలా చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఒక వైసీపీ నేత మరింత దిగజారుడు మాటలతో అందరినీ షాక్‌కు గురి చేశారు.
ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా మూర్తి అనే వైకాపా నేత.. తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి గ్రీష్మ అనే మహిళా నేత మీద దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన అదుపు తప్పిపోయారు.ఆంధ్రప్రదేశ్‌లోమహిళల భద్రత ప్రమాదంలో ఉందని.. రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదంటూ కావలి గ్రీష్మ వాదన లేవనెత్తారు. ఇందుకు ఇటీవలి ఉదంతాలు కొన్ని ఉదహరించారు.
ఐతే దీనిపై వైకాపా నేత అయిన మూర్తి ఎదురు దాడి చేసే క్రమంలో దారుణమైన కామెంట్ చేశారు. ఈమెను మెంటల్ హాస్పిటల్లో చూపించండి అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘‘ఎవరి చేత నువ్వు మానభంగం చేసుకున్నావు? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా? నువ్వు ఏపీలోనే ఉన్నావా?’’ అంటూ అదే రెట్టించి రెట్టించి అడిగారు.
ఏపీలో జరుగుతున్న ఉదంతాల గురించి ఉదాహరణలతో చెబుతుంటే.. నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడగడం దారుణాతి దారుణం. దీనికి గ్రీష్మ స్పందిస్తూ.. కొడాలి నాని దగ్గర క్రాష్ కోర్సు చేశారా, ఇలాంటి వాళ్లతో నేను మాట్లాడను అంటూ మిన్నకుండిపోయారు. దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడుతున్న వైకాపన్లకి మహిళా శక్తి ఏంటో చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
This post was last modified on April 1, 2022 1:45 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…