Political News

ఆ దాడులకు భయపడను: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేవైఎం నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై కేజ్రీవాల్ స్పందించారు. దేశం కోసం ప్రాణాలిస్తానంటూ కేజ్రీవాల్ భావోద్వేగంగా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో ఈ-ఆటోల‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా ఆ ఘటనపై కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కేజ్రీవాల్ ముఖ్యం కాదని, తనకు ఈ దేశ‌మే ముఖ్యమని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, ఈ దాడి ఘటన నేపథ్యంలో బీజేపీ నేత‌ల‌కు కేజ్రీ చుర‌క‌లంటించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ దేశ ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తోందని కేజ్రీ విరుచుకుపడ్డారు. ఈ తరహా దాడుల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని, బీజేపీ అనుస‌రించే ఈ తరహా చ‌ర్య‌లు దేశ యువ‌త‌కు త‌ప్పుడు సంకేతాలు పంపుతాయని హిత‌వు ప‌లికారు.

దేనినైనా ఎదుర్కోవటానికి ఈ తరహా వైఖరే సరైన మార్గం అని ప్రజలు అనుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. క‌లిసిక‌ట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రముంద‌ని, 75 ఏళ్లుగా ఈ తరహా క‌ల‌హాల‌తోనే దేశాన్ని ఎక్క‌డ వేసిన గొంగ‌ళిలా అక్క‌డే ఉంచామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పురోగమించదని బీజేపీపై కేజ్రీ మండిప‌డ్డారు. బుధవారం నాడు తన ఇంటిపై దాడి జరగగా…గురువారం నాడు కేజ్రీవాల్ స్పందించారు.

అంతకుముందు, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడం, బీజేపీ బొక్కబోర్లా పడడం వంటి ఘటనల నేపథ్యంలోనే కేజ్రీవాల్ పై బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో కేజ్రీని ఓడించ‌లేక బీజేపీ ఇలా త‌మ కార్య‌క‌ర్త‌ల‌తో దాడులకు పాల్పడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే, త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ పోటీచేయనుందని, అక్కడ కూడా కేజ్రీ హవా కొనసాగుతుందేమోనన్న భయంతోనే బీజేపీ ఈ దాడులకు తెగబడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

This post was last modified on April 1, 2022 9:41 am

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

29 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

47 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

52 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago