ఏపీ సీఎం జగన్‌కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒకటి.. పాఠశాలల్లో సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన హైకోర్టు.. ఏకంగా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్షమాపణ చెప్పినా.. వెనక్కి తగ్గని కోర్టు.. వారికి సేవను శిక్షగా విధించింది. పాఠశాలల్లో.. నెలకు ఒకరోజు సేవ చేయాలని… ఒక రోజుకోర్టు ఖర్చులు ఇవ్వాలని.. ఆదేశించింది.
పాఠశాలల్లో మధ్య హ్న భోజన ఖర్చునుకూడా ఐఏఎస్‌లు భరించాలని ఆదే శించింది. ఈ షాక్ నుంచి సర్కారు కోలుకోకముందే.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని.. నిలదీసింది. అంతేకాదు… గడువు లోగా .. వారిని ప్రభుత్వమే పక్కన పెట్టాలని… లేక పోతే.. తామే జోక్యం చేసుకుంటామని.. అప్పుడు చాలా సీరియస్ గా ఉంటుందనని హైకోర్టు హెచ్చరించింది.
వైస్ ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి, తిరుపతి నేత భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా.. హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. “ఈ పని ప్రభుత్వమే చేస్తే.. మంచిది..మేం జోక్యం చేసుకుంటే… ఫలితాలు వేరుగా ఉంటాయి“ అని సీరియస్ కామెంట్లు చేసింది.
నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వేయిదా వేసింది. మరి ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 31, 2022 9:40 pm
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఎక్కువ ఎడ్జ్ ఉన్నది మెకానిక్ రాకీకే. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ ఏదో…
నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన…
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి ఒక సెట్ ఆఫ్ టెక్నీషియన్లతో పని చేస్తూ వచ్చాడు. ఆయన సినిమాలకు ఇప్పటిదాకా…