ఏపీలో అన్నీ కొత్తకత్తగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీలకమైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి.. మంత్రి వర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీలక మార్పులు వంటివి ఏప్రిల్‌లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా పూర్తయింది. దీనిని ఉగాది రోజు ప్రకటిస్తారని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మరుసటి రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు షురూ కానుంది. పాలనకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించనున్నారు. ఇక, ఇదే నెలలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. మంత్రివర్గ ప్రక్షాళన చేయనుంది. మొత్తం మంత్రి వర్గాన్ని మారు స్తారని… తెలుస్తోంది. ఇది కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకునే ఒక సంచలన మార్పు. తద్వారా.. వైసీపీ ప్రభు త్వం కీలకమైన మార్పు దిశగా అడుగులు వేయనుంది. ఇదిలావుంటే.. పార్టీలోనూ ఇదే నెలలో కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తర్వాత… ఆయా జిల్లాల్లో ఇంచార్జ్‌లను నియమించనున్నారు.
ఇది వైసీపీలో ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్‌లోనే రచ్చబండ కార్య క్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో నిర్వహించా లని భావిస్తున్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అయితే..ఈ నెలలోనే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, మరోముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయనున్నట్టు తెలుస్తోంది.
అదే.. జగనన్న టౌన్ షిప్‌లు. గత నెలలోనే దీనికి సంబంధించిన ముసాయిదా ఇచ్చినా.. అధికారికంగా.. దీనినిప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసి.. ప్రారంభించేలా..ఏప్రిల్‌లో నే చర్యలు తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు.. దీనిని చేరువ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీలో ఏప్రిల్ మార్పులు భారీగానే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.
This post was last modified on March 31, 2022 7:45 am
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…