తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నా రు. ఇక, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో అనేక మంది నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు.. నాయకులు.. ముఖ్యంగా అప్ కమింగ్ నేతలు.. చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు.
ఎందుకంటే.. 40 ఏళ్ల పార్టీ.. మరో 40 ఏళ్లపాటు.. పార్టీని నడిపించడంపై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ సందర్భంగా అటు చంద్రబాబు కానీ, ఆయన కుమారు డు.. లోకేష్‌కానీ..చేసిన ప్రసంగాలపై పార్టీలో కొందరు పెదవి విరుస్తున్నారు. రాజకీయాలకు వేదికగా.. మారడంపై ఒకింత నొచ్చుకుంటున్నారు. రాజకీయాలు ఉండాల్సిందే కానీ.. ఆవిర్భావ సమయంలో మున్ముందు కార్యాచరణ ఏంటి? అనేవి ప్రస్తావించలేదని.. కొందరు అంటున్నారు.
మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో మనం ముందుకు వెళ్లాలి.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఆత్మ శోధన వంటివాటిని ఎక్స్‌పెక్ట్ చేసిన వారు.. నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. ఒక విషయంలో మాత్రం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం మంది యువతకు ప్రాధాన్యం ఇవ్వడం. ఇది ఒక్కటి ఆశించిన పరిణామంగా చెబుతున్నారు. అయినప్పటికీ.. పరనిందకే ప్రాధాన్యం ఇవ్వడం..ఆసాంతం సభ అంతా.. జగన్ కోసమో.. వైసీపీ పాలనకోసమో.. నిర్వహించినట్టుగా ఉందనేవారు కూడా ఉన్నారు.
అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్‌బాబు కానీ.. తమ తమ ప్రసంగాలను మొత్తంగా.. జగన్ పాలన చుట్టూనే తిప్పారు.. కానీ.. ఇన్నేళ్లలో పార్టీ నడిచిన విధానాన్ని మరింత వివరించి ఉంటే… బాగుండేదని.. వచ్చే రోజుల్లో అందునా.. వచ్చే 40 ఏళ్లపాటు.. పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనే విషయాన్ని కూడా స్పష్టం చేసి ఉంటే.. బాగుండేదని.. అంటున్నారు. దిశానిర్దేశం మరింత పెరగాల్సిన అవసరం ఉందని.. అంటున్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను, బూత్ స్థాయి కమిటీల విషయాన్ని.. తేల్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇవన్నీ.. వదిలేసి.. కేవలం పరనిందకే పరిమితం అయినట్టుగా.. ఉందని.. గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on March 30, 2022 6:48 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…