జగన్ కేబినెట్‌లో మంత్రుల మార్పునకు ముహూర్తం ఫిక్సయిపోయింది. ఇప్పటికే కొత్తగా పదవులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయిందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా.. పరిస్థితి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. జగన్ మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకురాలికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది. అదే విధంగా స్పీకర్ తమ్మినేనిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక, శ్రీకాకుళం నుంచే మరొకరికి అవకాశం ఇస్తున్నారు.
ఇక, విజయవాడ నుంచి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అవకాశం రెడీ అయింది. నెల్లూరు నుంచి ఆనం లేదా.. ప్రసన్నకుమార్‌రెడ్డికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇలా.. మొత్తంగా కీలక నేతలతోనే ఈ దఫా ఎన్నికల క్యాబినెట్‌ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకుంటున్నారట. వచ్చే నెల 11న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెల 9న సీఎం స్వయంగా.. గవర్నర్‌ను కలిసి.. మంత్రుల జాబితాను ఆయనకు అందజేసి.. వీరి ప్రొఫైల్స్‌ను వివరించనున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఇక, అదేరోజు.. రాత్రి గవర్నర్ బంగ్లాలోనే.. మంత్రులకు ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి.. ఏప్రిల్ 9వ తేదీతోనే మంత్రులు ఇక, మాజీలు కానున్నారు. అదే నెల 11న కొత్త మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. అయితే.. ఈ జాబితా ఇప్పటికే సిద్ధమైనా.. పదవులు పొందేవారికి మాత్రం ఒక్కరోజు ముందు మాత్రమే చెప్పనున్నట్టు సమాచారం. ఇప్పుడు ఏవిధంగా అయితే.. మంత్రి వర్గ కూర్పు ఉందో.. అదే కూర్పును కొనసాగించి.. కేవలం అభ్యర్థులను మాత్రం మారుస్తారని.. అంటున్నారు.
అదేవిధంగా.. సజ్జల రామకృష్ణారెడ్డికి కొత్తగా అవకాశం ఇవ్వడంతోపాటు.. బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన గౌతం రెడ్డి సతీమణికి కూడా బెర్త్ కేటాయించారని.. అంటున్నారు. ఏదేమైనా.. ముసుగు తొలిగిపోయేందుకు ముహూర్తం దగ్గర పడడం గమనార్హం.
This post was last modified on March 30, 2022 12:32 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…